జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు..! హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో జంట పేలుళ్లు జరిగాయి.. వెంటనే హైఅలర్ట్ ప్రకటించాయి భద్రతా దళాలు.. ఘటనా స్థలాన్ని ఎన్ఐఏ, ఎన్ఎస్జి టీమ్‌లో పరిశీలించాయి.. జమ్మూలోని వైమానిక దళం స్టేషన్‌లోని హై సెక్యూరిటీ జోన్లో ఇవాళ తెల్లవారుజామున రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. అయితే, అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు.. ఎటువంటి నష్టం జరగలేదు.. ఆదివారం తెల్లవారుజామున ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగినట్టుగా చెబుతున్నారు.. మొదటి పేలుడు తెల్లవారుజామున 1:37 గంటలకు ఒక భవనం పైకప్పుపై జరగా.. రెండవది.. తెల్లవారుజామున 1:42 గంటలకు నేలపై జరిగినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ రెండు పేలుళ్ల తీవ్రత చాలా తక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.. ఈ పేలుళ్లలో భవనం పైకప్పుకు స్వల్ప దెబ్బతిందని.. అంతకుమించి ఎలాంటి నష్టం జరగలేదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు భారత వైమానిక దళం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.. ఈ ప్రాంతాన్ని భద్రతా దళాలు నిమిషాల్లోనే చుట్టుముట్టాయి. రెండు పేలుళ్లకు కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఆ స్థలంలో ఉన్నాయని.. వైమానిక దళం స్టేషన్ వెలుపల విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది మరియు ఈ విషయాన్ని అన్ని కోణాల నుండి పరిశీలిస్తున్నామని.. ఉగ్రవాద కోణాన్ని కూడా తోసిపుచ్చలేమని చెబుతున్నారు.
Also Read
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- Cockroach Janta Party: మోడీ సర్కార్‌కు బొద్దింకల అల్టిమేటం..
తాజావార్తలు
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!