Boat Capsizes: బీహార్ రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చప్రాలో సరయూ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలు వెలికితీశారు. మరో 15 మంది కోసం గాలిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు.