Reel On Track: రీల్స్ కోసం పిచ్చి పని.. రైలు ఢీకొని బాలుడి మృతి..

  • రీల్స్ పిచ్చికి మరో ప్రాణం బలి..
  • రైల్వే ట్రాక్‌పై 15 ఏళ్ల బాలుడి రీల్స్..
  • రైలు ఢీకొని స్పాట్ డెడ్..
Reel

Reel

Reel On Track: రీల్స్ పిచ్చి యువత ప్రాణాలను తీస్తోంది. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని, వ్యూస్, సబ్‌స్క్రైబర్లను పెంచుకోవాలనే పిచ్చి కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ 15 ఏళ్ల బాలుడు కూడా ఇదే విధంగా మరణించాడు. ఒడిశాలోని పూరిలోని రైల్వే ట్రాక్‌పై రీల్ షూట్ చేస్తున్న సమయంలో రైలు ఢీకొని మరణించాడు. మంగళవారం జనక్‌దేవ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. మృతుడిడిన విశ్వజీత్ సాహూగా గుర్తించారు. అతను తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శిస్తూ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Read Also: S*X Rocket: బంజారాహిల్స్లో సె*క్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశీ యువతి సహా పలువురు అరెస్ట్.!

ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో, అతను సోషల్ మీడియా కోసం ఒక చిన్న వీడియోను రికార్డ్ చేయడానికి రైల్వే ట్రాక్‌పై ఆగాడు. ఈ వీడియోలో సాహూ అవతలి వైపు నుంచి వస్తున్న రైలును రికార్డ్ చేస్తున్నాడు. రైలు సమీపించడంతో గాలి వేగానికి అతడి చేతిలోని ఫోన్ నెలపై పడిపోయింది. రైలు ఒక్కసారిగా ఢీకొనడంతో సాహూ అక్కడికక్కడే మరణించాడు. ఒడిశా రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.