S*X Rocket: బంజారాహిల్స్లో సె*క్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశీ యువతి సహా పలువురు అరెస్ట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S*X Rocket: హైదరాబాద్‌లో మరోసారి సెక్స్ రాకెట్ బట్టబయలు అయ్యింది. బంజారాహిల్స్ ప్రాంతంలో పెద్ద సెక్స్ రాకెట్‌ను తాజాగా పోలీసులు గుట్టురట్టు చేశారు. రోడ్ నెంబర్ 12లో ఉన్న R-Inn హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షరీఫ్ అనే వ్యక్తి ఆ హోటల్‌లో రెండు రూమ్‌లను అద్దెకు తీసుకుని.. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు. అతను ఉద్యోగాల పేరుతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు.
Rape Attempt: మైనర్ బాలికపై దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉండడంతో..!
Also Read
పక్కా సమాచారం రావడంతో బంజారాహిల్స్ పోలీసులు R-Inn హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఈ రైడ్‌లో ముగ్గురు యువతులు, వ్యభిచారం కోసం వచ్చిన ఏడుగురు విటులు, ఇంకా ఈ రాకెట్ నిర్వాహకుడు షరీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన యువతుల్లో ఒకరు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఈ ముఠా కార్యకలాపాలు, ఇతర లింకుల గురించి పోలీసులు షరీఫ్‌ను, మిగతా వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Puri Jagannadh: పూరి జగన్నాథ్ ఫోకస్ అంతా ‘పూరి సేతుపతి’ పైనే!
తాజావార్తలు
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?