Air India crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని 242 మందితో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం ఢీకొట్టిన క్రాష్ సైట్‌లో మరో 24 మంది మరణించారు. గురువారం మధ్యాహ్నం లండన్‌కి బయలుదేరిన ఎయిరిండియా సంస్థకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది.
Read Also: Ahmedabad Tragedy: భారతదేశ వ్యాప్తంగా బోయింగ్ 787-8 విమానాలు నిలిపివేత..?
అయితే, ఈ ప్రమాదంలో క్రాష్ సైట్‌లో కుక్కుల, పక్షుల వంటి ప్రాణాలు కూడా తప్పించుకోలేకపోయాయి. 1.25 లక్షల లీటర్ల ఇంధనం కారణంగా విమానం కూలిపోవడంతోనే అగ్నిగుండాన్ని తలపించింది. క్రాష్ సైట్ వద్ద ఉష్ణోగ్రతలు ఏకంగా 1000 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఈ స్థాయిలో వేడి వల్ల రెస్క్యూ చర్యలకు కూడా ఆటంకం ఏర్పడింది. ఆ ప్రదేశంలో ఉన్న కుక్కలు, పక్షులు కూడా ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయాయని రెస్క్యూ సిబ్బంది చెప్పారు. విమాన ప్రమాదంతో ఇంధన ట్యాంక్ పేలడంతో కొద్దిసేపట్లోనే ఉష్ణోగ్రతలు పెరిగాయని, దీనివల్ల ఎవరూ తప్పించుకోలేకపోయారని అగ్నిమాపక అధికారులు చెప్పారు.