NTV Telugu Site icon

India Not A Nation: “భారత్ ఒక దేశం కాదు”.. డీఎంకే నేత రాజా వ్యాఖ్యలపై స్పందించిన ఇండియా కూటమి..

A Raja

A Raja

India Not A Nation: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి డీఎంకే సీనియర్ నేత ఏ రాజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రాజా.. తాజాగా ‘‘ఇండియా ఒక దేశం కాదు’’ అని అన్నారు. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మరోవైపు ఇండియా కూటమి నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.

డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ ఈ వ్యాఖ్యల్ని ఖండించింది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని చెప్పింది. రాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటేని ప్రశ్నించగా.. అతని వ్యాఖ్యలతో తాను 100 శాతం ఏకీభవించనని అన్నారు. రాముడు అందరికీ చెందిన వాడని, అందరినీ కలుపుకుని పోయేవాడని నేను నమ్ముతానని అన్నారు. ఇండియా కూటమిలో ఆర్జేడీ పార్టీ చీఫ్ తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇది అతని వ్యక్తిగత ప్రకటన అని, ఇది కూటమిని ఉద్దేశించవని అన్నారు.

Read Also: Bengaluru water crisis: బెంగళూర్‌లో తీవ్ర నీటి సంక్షోభం.. డిస్పోజబుల్ ప్లేట్లు, వెట్ వైప్స్ వాడాలని కోరుతున్న గేటెడ్ కమ్యూనిటీలు..

డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజా ప్రసంగిస్తూ.. ‘‘భారతదేశం ఒక దేశం కాదు, దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక దేశం ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతిని సూచిస్తుంది. ఇలాంటి లక్షణాలు మాత్రమే ఒక దేశాన్ని తయారు చేస్తాయి. తమిళనాడుకు వస్తే, ఒక సంస్కృతి ఉంది, కేరళలో, మరొక సంస్కృతి ఉంది, ఢిల్లీలో మరొకటి ఉంది.’’ అంటూ వ్యాఖ్యానించారు. జైశ్రీరాం, భారత్ మాతాకీ జై అనే నినాదాలను మేము ఎప్పటికీ అంగీకరించబోమని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. డీఎంకే ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరంతరం కొనసాగుతున్నాయని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చాడని, ఇప్పుడు భారతదేశాన్ని ‘‘బాల్కనైజేషన్’’ చేయాలని ఆ పార్టీ నేత ఏ రాజా పిలుపునిస్తున్నాడని, భగవాన్ రామ్‌ని అవహేళన చేస్తున్నాడని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్, ఇండి కూటమి ఈ వ్యాఖ్యల్ని అంగీకరిస్తుందా..? అని ప్రశ్నించారు.

Show comments