Rajinikanth: సర్ ఇంతకీ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారా? లేక ఆపేస్తున్నారా?
దళపతి విజయ్, సూర్య, కార్తీ, ధనుష్, శింబు, విశాల్, శివ కార్తికేయన్ లాంటి తమిళ స్టార్ హీరోలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తల అజిత్ కూడా అప్పుడప్పుడు తన సినిమాలని డబ్ చేసి మంచి కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాడు. ఈ స్టార్స్ కన్నా దశాబ్దాల ముందే తెలుగులో స్ట్రెయిట్ హీరో రేంజ్ హిట్స్ అందుకున్నారు రజినీకాంత్, కమల్ హాసన్. ఈ ఇద్దరినీ తమిళ హీరోలుగా తెలుగు ఆడియన్స్ ఏ రోజు అనుకోలేదు. అంతగా మన ఆడియన్స్ కి దగ్గరైన ఈ స్టార్ హీరోల నుంచి సినిమా వస్తుంది అంటే ఈ రోజుకీ స్ట్రెయిట్ సినిమా అనే ఫీలింగ్ లోనే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తారు. ఇటీవలే కమల్ నుంచి వచ్చిన విక్రమ్ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కమల్ కన్నా రజినీకాంత్ కి తెలుగులో ఇంకా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేస్తారు. ఆ రేంజ్ ఫాన్ బేస్ ని మూడు దశాబ్దాలుగా తెలుగులో మైంటైన్ చేస్తూనే ఉన్న రజినీకాంత్, ఈసారి మాతరం తన కొత్త సినిమా ప్రమోషన్స్ విషయంలో తెలుగుని పూర్తిగా లైట్ తీసుకున్నట్లు ఉన్నాడు.
రజిని ప్రస్తుతం నెల్సన్ తో ‘జైలర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 10న థియేటర్స్ లోకి రావడానికి రెడీగా ఉంది. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి ఇతర ఇండస్ట్రీ స్టార్ హీరోలు కూడా జైలర్ సినిమాలో నటించారు. ముగ్గురు సౌత్ సూపర్ స్టార్ హీరోలు నటించిన జైలర్ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం తమిళ్ లో మాత్రమే జరుగుతున్నాయి. తమిళ్ భాషలోని సాంగ్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. జైలర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయ్యింది కానీ ప్రమోషన్స్ మాత్రం ఒక్క భాషలోనే ఎందుకు చేస్తున్నారో మేకర్స్ కే తెలియాలి. మరో రెండు వారాల్లోనే జైలర్ సినిమా రిలీజ్ ఉంది, సాంగ్స్ తెలుగులోకి డబ్ చేసి ప్రమోషన్స్ కి కిక్ స్టార్ట్ చేయాలి. ఇంకా లేట్ చేస్తే తెలుగులో కనీసం చెప్పుకునే స్థాయి థియేటర్స్ కూడా దొరికే పరిస్థితి కనిపించట్లేదు. పైగా ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. చిరు ముందు థియేటర్స్ సొంతం చేసుకోవడం జైలర్ కి కాస్త కష్టమైన పనే.
Also Read
- Adivi Sesh: "నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?" అన్నవారికి అడివి శేష్ షాకింగ్ రిప్లై!
- Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్డేట్!
- Top Heroines : ఆ రెండు భారీ చిత్రాల వల్ల ఆఫర్లు కోల్పోతున్నఇద్దరు హీరోయిన్లు!
- Raaka : దీపికా డెడికేషన్ కు యూనిట్ ఫిదా.. రూమర్స్ పై మేకర్స్ క్లారిటీ
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!