Yukti Thareja Shares her Boldest Photos ever: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. మిగతా సినీ పరిశ్రమల్లో కన్నా ఇక్కడ క్లిక్ అయితే క్రేజ్ ఉనుందని చాలా మంది రాష్ట్రాలు దాటి టాలీవుడ్‌కు వస్తుంటారు. అలా వచ్చిన చాలా మంది హీరోయిన్లుగా మంచి సక్సెస్ అందుకున్నారు.
అలాంటి వారిలో ‘రంగబలి’ మూవీ హీరోయిన్ యుక్తి తరేజా ఒకరు, అదేంటి సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు కదా అనుకుంటున్నారా.. అవును నిజమే సినిమా సక్సెస్ అవ్వకున్నా తన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ ఇండస్ట్రీలో పాగా వేసే ప్రయత్నం చేస్తోంది.
యుక్తి తరేజా 2001 జనవరి 5వ తేదీన హర్యానా రాష్ట్రంలోని కైతాల్ జిల్లా కేంద్రంలో జన్మించి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ (కామర్స్) చదివింది. ఆ యూనివర్సిటీలోనే నిర్వహించే డాన్స్ పోటీలు, ప్రదర్శన పోటీల్లో ఎంతో చురుకుగా పాల్గొనే ఆమె మోడలింగ్‌పై దృష్టి సారించింది.
అలా 2019లో ఎంటీవీ ‘సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్’లో పోటీ కూడా చేసింది. 2021 ఫిబ్రవరిలో ఆమె ఇమ్రాన్ హష్మీతో కలిసి జుబిన్ నౌటియల్ పాడిన ‘లుట్ గయే’ పాటకు చిత్రీకరించిన మ్యూజిక్ వీడియోలో యుక్తి తరేజా కనిపించగా ఆ వీడియో అప్పట్లో సెన్సెషన్ అయింది. ముగ్గురు వ్యక్తులు ఒక వధువును ఎలా చంపారు? ఆ తర్వాత వారిని ఎన్‌కౌంటర్‌లో ఎలా కాల్చి చంపారు? అనే థీమ్‌తో వీడియోను రూపొందించగా ఈ వీడియోతో యుక్తి తరేజాకు మంచి గుర్తింపు వచ్చింది.
అక్కడ చూసే యుక్తి తరేజాకు ‘రంగబలి’ సినిమాలో హీరోయిన్‌గా నటించమని అవకాశం ఇచ్చారట. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా నాగ శౌర్య నటించగా జులై 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో క్రేజీ టాక్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ అయి చాలా కాలం అయింది కదా తనని జనాలు మరచిపోతారు అనుకుందో ఏమో ఆమె అన్ని హద్దులు చెరిపేస్తూ అంగాంగ ప్రదర్శన చేస్తూ రెచ్చిపోయింది.