బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న ఈ సినిమాకి కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన జవాన్  సినిమా అన్ని భాషల్లోనూ పాజిటివ్ స్పందనను దక్కించుకుంది.

ఈ సినిమాలో హీరో షారుఖ్ ఖాన్ ను పెంచిన తల్లి పాత్రలో రిధి డోగ్రా నటించింది. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

సినిమాలో పెంచిన తల్లి రోల్ కి సంబంధించిన విషయాలు పంచుకుంటూ షారుఖ్ తల్లిగా నటించేందుకు ముందు ఆసక్తి చూపకపోయినా తర్వాత అంగీకరించానని తెలిపారు.

డైరెక్టర్‌ అట్లీ అర్జంట్‌గా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని 2022 జూన్‌లో నాకు ఫోన్‌కాల్‌ వచ్చిందని, మొదట్లో కొంచెం టెన్షన్‌ పడ్డా కానీ ఆయనతో మాట్లాడిన తర్వాత భయం పోయిందని అన్నారు.

అట్లీ నా పాత్ర గురించి వివరించగా నేను బాగా ఆలోచించి నో చెప్పానని, ఎందుకంటే షారుఖ్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

తెరపైనైనా ఆయనకు తల్లిగా కనిపించాలంటే మనసు అంగీకరించలేదని పేర్కొన్న రిధి కొన్ని రోజుల తర్వాత అట్లీతో మళ్లీ చర్చలు జరగగా కథ, ఆయా పాత్రలపై ఆయనకున్న స్పష్టత చూసి కన్విన్స్‌ అయ్యానని అన్నారు.

2007 నుంచి బాలీవుడ్ బుల్లితెర మీద కనిపిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆమె ఏకంగా రెండో సినిమాకే షారుఖ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది.

సినిమాలో ఆమె జైలర్ పాత్రలో, షారుఖ్ ను పెంచిన పాత్రలో చాలా పద్దతిగానే కనిపించింది కానీ ఆమె రియల్ లైఫ్ లో మాత్రం చాలా హాట్, ఆమె ఫోటోలు మీరూ చూసేయండి.