Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున మంచు విష్ణు టీం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని టెర్మినేట్ చేయించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముందుగా ఐదు చానల్స్, ఆ తర్వాత 18 చానల్స్ ని టెర్మినేట్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే రెండో సారి తొలగించబడిన 18 చానల్స్ లో ఒకటే నడిపే చంద్రహాస్ అనే వ్యక్తి ఇప్పుడు మంచు విష్ణుకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. మంచు విష్ణు టీం తనతో జరిపిన సంప్రదింపులకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని అతను సవాలు చేస్తున్నాడు. కాల్ రికార్డింగ్స్, మెయిల్స్ తో పాటు అన్నీ ఓపెన్ ప్లాట్ ఫామ్లో షేర్ చేస్తానని మంచు విష్ణు మీద ఫైర్ అవుతూ ఒక వీడియో షేర్ చేశాడు. మంచు విష్ణు చెప్పింది 18 చానల్స్ అయినా సరే అనధికారకంగా చాలా చాలా బ్లాక్ చేశాడు, నిజానికి వేరే హీరోల ఎవరి ఫ్యామిలీస్ ని మేము ట్రోల్ చేయట్లేదు కానీ నిన్ను ట్రోల్ చేస్తున్నామంటే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి.
మా అసోసియేషన్ ఇలా నీ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నావు అంటూ సదరు యూట్యూబర్ వ్యాఖ్యానించాడు. కన్నప్ప మీద పాజిటివ్ వీడియోలు చేస్తే అప్పుడు స్ట్రైక్స్ తీయిస్తామని అన్నట్టుగా ఇప్పటికే పేర్కొన్నాడు. అయితే ఈ విషయం మీద మంచు విష్ణు టీం ఇప్పటికే అది తమ అధికారిక ఖాతాల నుంచి వచ్చింది కాదని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని చెబుతూ ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెడితే దాన్ని కూడా స్ట్రైక్ వేసి తీయించేసారని తెలుస్తోంది. తాజాగా మరో వీడియో రిలీజ్ చేసిన చంద్రహాస్ మంచు విష్ణు ఈగో వల్ల ఇదంతా జరుగుతోందని తన దగ్గర ఉన్న కాల్ రికార్డింగ్స్, మెయిల్స్ అన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరించాడు. నన్ను ఫేక్ అంటున్నారు కాబట్టి నిజం ఏమిటి అనేది సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తానంటూ మంచు విష్ణు టీంకి వార్నింగ్ ఇచ్చాడు. మంచు విష్ణు ట్విట్టర్ అకౌంట్ ని ట్యాగ్ చేసి మీ తప్పు ఒప్పుకోవాల్సిందిగా కోరాడు. మరి మంచు విష్ణు ఎలా స్పందిస్తాడు అనేది చూడాల్సి ఉంది.