Renu Desai Shocking Comments on Second Marriage: హీరోయిన్గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత కొన్నాళ్లకు హీరో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరు సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు జన్మను కూడా ఇచ్చారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నా అనుకోని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు. ఇక తర్వాత రేణు దేశాయ్ పిల్లలతో పాటు పూణే హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తుంది. కొన్నాళ్లపాటు పూణేలో ఉంటుంటే కొన్నాళ్లపాటు హైదరాబాద్లో ఉంటుంది. అయితే ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్ మకాం మార్చేసి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. అయితే ఆమె నటించిన టైగర్ నాగేశ్వరరావు పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ గట్టిగా ప్రయత్నాలు చేయడం లేదు. ప్రస్తుతం సోషల్ సర్వీస్ కే సమయం కేటాయిస్తోంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన చిన్నప్పటి విషయాలను కొన్ని బయటపెట్టి ఆమె ఎమోషనల్ అయింది.
Tollywood: ఒక క్లిక్..ముగ్గురు స్టార్ హీరోల లేటెస్ట్ అప్‌డేట్స్..
ఆమె మాట్లాడుతూ తమ మరాఠీ తల్లిదండ్రులకు ముందు నుంచి మగపిల్లాడు పుడతాడని నమ్మకం పెట్టుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే మగపిల్లాడి బదులు తాను పుట్టేసరికి నిరాశకు గురయ్యారని, తన తండ్రి తనను చూసేందుకు కనీసం తాకేందుకు సైతం ఇష్టపడలేదని బయటపెట్టింది. నిజానికి ఇప్పుడైతే చాలామంది అమ్మాయినైనా భరిస్తున్నారు కానీ ఒకప్పుడు చంపడానికి కూడా వెనకాడే వారు కాదు. అయితే నా తల్లిదండ్రులు చదువుకున్నవారు కావడంతో నన్ను చంపలేదు, మా ఇంట్లో ఉన్న పనిమనిషి నన్ను ప్రేమగా పెంచింది. తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమను నేను దక్కించుకోలేకపోయాను. అయితే విడాకులు తీసుకున్న తర్వాత పుట్టింటి వారు ఆదరించకపోవడం తన బాగా ఇబ్బంది పెట్టిందని చాలా రోజులు పాటు బాధపెట్టిందని చెప్పుకొచ్చింది. నాలాగే నా పిల్లల జీవితం కూడా నాశనం కాకూడదని రెండో వివాహానికి నిశ్చితార్థం చేసుకుని కూడా క్యాన్సిల్ చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.