Deepa: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. మంచి నటిగా ఎదగాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఒక యువనటి చిన్న వయస్సులోనే కన్నుమూసింది. భవిష్యత్తు లో స్టార్ హీరోయిన్ అయ్యింది అనుకున్న అందరికి కంటతడి మిగులుస్తూ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ప్రముఖ కోలీవుడ్ యువనటి దీప అలియాస్ జెస్సి పౌలిన్(29) ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. చెన్నైలోని విరుగాంబాక్కం లోని ఒక ప్లాట్ లో నివసిస్తున్న ఆమె మృతదేహం శనివారం ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా కోలీవుడ్ ఉలిక్కిపడింది. అసలు ఈ దీప ఎవరు అంటే.. ఆమె అసలు పేరు జెస్సికా పౌలిన్. ఆమె వయస్సు 29. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఫేమస్ అయిన దీప కోలీవుడ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. విశాల్ నటించిన తుప్పరివాలాన్ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో కనిపించింది. ఇదే సినిమా తెలుగులో డిటెక్టివ్ గా తెలుగు లో రిలీజ్ అయ్యింది. ఇక ఈ మధ్యనే నాజర్ ప్రధాన పాత్రలో నటించిన వైదా చిత్రంలో దీప కీలక పాత్రలో కనిపించింది.
ఇక ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె సన్నిహితులు తెలుపుతున్నారు. ఇండస్ట్రీలోనే ఉన్న ఒక యువకుడితో దీప ప్రేమలో ఉందని చెప్పుకొస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె డిప్రెషన్ లో ఉందని, ఫోన్ కాల్స్ ఏవి లిఫ్ట్ చేయడంలేదని దీప తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిన్న చాలాసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి దీప ఫ్రెండ్స్ ని ప్లాట్ కు వెళ్లి చూడమని చెప్పామని, ఇంటికి వెళ్లిన వారి ఫ్రెండ్స్ కూతురు చావు వార్త తెలిపినట్లు దీప తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీప మృతిపట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి.. ఇలాంటి నిర్ణయం తీసుకొని తప్పు చేసిందని వాపోతున్నారు.