విలక్షన నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆది.. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వైశాలీ’ సినిమా దర్శకుడు అరివళగన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్న ఆది రీసెంట్‌గా అతడిపై వస్తున్న విడాకుల వార్తలపై స్పందించాడు.
Also Read: Niharika: ఓటీటీలోకి వచ్చేసిన నిహారిక తమిళ్ సినిమా..
ఆది మాట్లాడుతూ.. ‘ పెళ్లికి ముందు నుండే నిక్కీ నాకు బాగా తెలుసు. నా ఫ్యామిలీతో కూడా బాగా కలిసిపోయింది. ఇంట్లో వాళ్లకి కూడా నిక్కీ బాగా నచ్చడంతో తనతో ఉంటే సంతోషంగా ఉంటాను అనిపించింది. ఇంట్లో చెప్పి పెద్దల అంగీకారంతో మేము పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నాం. కానీ మేమిద్దరం విడిపోతున్నామని పలు యూట్యూబ్ ఛానల్స్‌లో కథనాలు వచ్చాయి. అవి చూసి చాలా కోపం వచ్చింది. బాధేసింది. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్, క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని పట్టించుకోవడం మానేశాను’ అని తెలిపాడు. అలాగే తన కెరీర్ గురించి కూడా మాట్లాడుతూ..
‘ ‘రంగస్థలం’ మూవీ నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అదే సినిమా ఇప్పుడు విందులై ఉంటే కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ సొంతం చేసుకునేది. ఈ మూవీలో నేను చనిపోయిన సన్నివేశం చిత్రీకరణ సమయంలో నా చుట్టూ ఉన్న నటీనటుల యాక్టింగ్ చూసి నాకు నిజంగా భయం వేసింది. మనిషి చనిపోతే ఇలా ఉంటుందా? అనిపించింది. మా నాన్న థియేటర్‌లో ఆ సీన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ‘సరైనోడు’ మూవీతో కూడా నాకు మంచి గుర్తింపు లభించింది.ఈ సినిమా విడుదలయ్యాక చిరంజీవి సార్ ఫోన్ చేసి మరి నన్నెంతో మెచ్చుకున్నారు. ఆ క్షణాలు మర్చిపోలేను’ అని తెలిపారు ఆది.