మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అక్కర్లేదు. యాంకరింగ్ ద్వారా బుల్లితెరపై ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ చిన్నది.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఆమె మద్రాస్కారణ్ అనే తమిళ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
Also Read: Pooja Hegde : ‘కాంచన 4’ లో పూజా హెగ్డే ఛాలెంజింగ్ రోల్..!
మాలీవుడ్ నటుడు షేన్ నిగమ్ హీరోగా యాక్షన్ కథాంశంతో వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పొంగల్ కానుకగా జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. ఫిబ్రవరి స్టార్టింగ్ లో ఓటీటీలోకి వచ్చింది. ఇక ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియో లో బుధవారం (ఫిబ్రవరి 26న) అంటే ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని ఆహా వీడియో అధికారికంగా ప్రకటించింది. ‘కొత్త వ్యక్తుల మధ్య జరిగిన ఓ చిన్న వాగ్వాదం వాళ్ళ జీవితాలను మార్చే సంఘర్షణకు దారితీసింది. ఒక్క క్షణం ఎప్పటికీ మన దృక్పథాన్ని, పరిస్థితులను మార్చేస్తుందో చూడండి. మద్రాస్కారణ్ ఫిబ్రవరి 26 నుంచి ఆహాలో’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దాని బట్టి చూస్తే నిహారిక అక్కడ కూడా ఫ్లాప్ అయినట్లు తెలుస్తోంది. పాపం ఈ మూవీ లో స్కిన్ షో చేసిన కూడా నిహారికకు లాభం లేకుండా పోయింది.