Aadhi Pinisetty : విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టిన యంగ్ హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షన నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి. ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ఆది.. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ‘శబ్దం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వైశాలీ’ సినిమా దర్శకుడు అరివళగన్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్న ఆది రీసెంట్గా అతడిపై వస్తున్న విడాకుల వార్తలపై స్పందించాడు.
Also Read: Niharika: ఓటీటీలోకి వచ్చేసిన నిహారిక తమిళ్ సినిమా..
Also Read
ఆది మాట్లాడుతూ.. ‘ పెళ్లికి ముందు నుండే నిక్కీ నాకు బాగా తెలుసు. నా ఫ్యామిలీతో కూడా బాగా కలిసిపోయింది. ఇంట్లో వాళ్లకి కూడా నిక్కీ బాగా నచ్చడంతో తనతో ఉంటే సంతోషంగా ఉంటాను అనిపించింది. ఇంట్లో చెప్పి పెద్దల అంగీకారంతో మేము పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నాం. కానీ మేమిద్దరం విడిపోతున్నామని పలు యూట్యూబ్ ఛానల్స్‌లో కథనాలు వచ్చాయి. అవి చూసి చాలా కోపం వచ్చింది. బాధేసింది. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్, క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని పట్టించుకోవడం మానేశాను’ అని తెలిపాడు.
అలాగే తన కెరీర్ గురించి కూడా మాట్లాడుతూ.. ‘రంగస్థలం’ మూవీ నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అదే సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ సొంతం చేసుకునేది. ఈ మూవీలో నేను చనిపోయిన సన్నివేశం చిత్రీకరణ సమయంలో నా చుట్టూ ఉన్న నటీనటుల యాక్టింగ్ చూసి నాకు నిజంగా భయం వేసింది. మనిషి చనిపోతే ఇలా ఉంటుందా? అనిపించింది. మా నాన్న థియేటర్లో ఆ సీన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ‘సరైనోడు’ మూవీతో కూడా నాకు మంచి గుర్తింపు లభించింది.ఈ సినిమా విడుదలయ్యాక మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి మరి నన్నెంతో మెచ్చుకున్నారు. ఆ క్షణాలు మర్చిపోలేను’ అని అన్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!