Marimuttu: కోలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ మరి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మారిముత్తు గతరాత్రి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఎప్పటిలానే ఇంటివద్ద.. గతరాత్రి భోజనం చేసి.. సిగరెట్ తాగడం అలవాటు అయిన మారిముత్తు.. బయటకు వచ్చి సిగరెట్ తాగిన కొద్దిసేపటికె దగ్గు రావడం, ఆపై ఊపిరి ఆడకుండపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మారిముత్తు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.
Mansoor Ali Khan: నాది వక్రబుద్ది అయితే.. చిరంజీవిది ఏంటి మరి.. ?
పరియేరుం పెరుమళ, కర్ణన్, మమన్నన్ లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు మారిముత్తు. అతని వయస్సు 30.. చిన్నతనం నుంచి మారిముత్తు సినిమాల మీద కోరికతో.. ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక అలా మారి సెల్వరాజ్ వద్ద అసిస్టెంట్ గా చేరాడు. మారి సెల్వరాజ్ తన సినిమాలను ఎలా మలుస్తాడో అందరికీ తెల్సిందే. ఇక అతనికి చేదోడు వాదోడుగా మారిముత్తు ఉండేవాడు. ఆలా అతను అసిస్టెంట్ గా చేసిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక దీంతో ఈ మధ్యనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడానికి ఒక కథను కూడా సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతను మృత్యువాత పడడం విషాదకరమని ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.. ఇక ఈ మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని వేరే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న మారిముత్తు ఇలా అర్దాంతరంగా మృతిచెందడం.. వారి కుటుంబానికి తీరని లోటు అని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు.