టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఈ నెలకు ఆ నెల భారీ ఎత్తున సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మురారి, సింహాద్రి, ఆరెంజ్, చెన్నకేశవ రెడ్డి, ఖుషి ఈ సినిమాలు రీరిలీజ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. దాంతో ప్రతి నెలలో ఒకప్పటి హిట్ సినిమాల పేరుతో రీరిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు జులై నెల వంతు. ఈ నెలలో రీరిలీజ్ కు అనేక సినిమాలు క్యూ కట్టాయి.
Also Read : Viswambhara : చిరు సరసన.. స్పెషల్ సాంగ్ లో మౌని రాయ్
హుషారు : 2018లో వచ్చిన ఈ సినిమా యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు ఈ సినిమా జులై 5న రీరిలీజ్ అవుతుంది.
MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా ధోని బర్త్ డే కానుకగా జులై 7న మరోసారి రిలీజ్ కాబోతుంది.
కుమారి 21F : రాజ్ తరుణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఈ నెల జులై 10 న వస్తోంది
మిరపకాయ్ : మాస్ మహారాజ్ రవితేజ, హరీష్ శంకర్కాంబోలో వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా జులై 11న రీరిలీజ్ అవుతోంది.
గజినీ : సూర్యను స్టార్ ని చేసిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కు రెడీ అయింది.
ఏ మాయ చేసావే : సమంత- నాగచైతన్య ప్రేమకి మొదటి అడుగుపడిన ఈ సినిమా 19న గ్రాండ్ గా రీరిలీజ్ కు వస్తుంది
వీడోక్కడే : విభిన్న కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఈ నెల 19న రీరిలీజ్ కాబోతుంది