Yogi Babu plays the role of the Health Minister’s PA in the Tamil version of Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లీడ్ రోల్లో నటించిన ‘జవాన్’ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ.. ఆ అంచనాలు దాటేసి మరీ ముందుకు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మొదటి రోజు ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసి మరిన్ని రికార్డు స్థాయి వసూళ్ల వైపు దూసుకుపోతోంది.. అధికారికంగా ఈ సినిమా 129.6 కోట్లు కలెక్ట్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. పఠాన్’ తొలి రోజు రూ.57 కోట్లు సంపాదించగా.. ‘జవాన్’ మాత్రం ఏకంగా 129.6 కోట్లు కలెక్ట్ చేసి టాప్కు చేరుకుంది. ఈ క్రమంలో షారుక్ మరో రికార్డును అందుకున్నట్టు అయింది. అదేమంటే ఒకే ఏడాదిలో రిలీజైన రెండు సినిమాలకు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఏకైక ఇండియన్ స్టార్‌గా ఆయన చరిత్రకెక్కారు.
Baby Husband : పాపం బేబీ మొగుడుకి రియల్ లైఫ్‌లో దిమ్మతిరిగే షాక్..ఒకే సారి ఇద్దరితో డేటింగ్?
ఇక ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా సీనియర్ నటి ప్రియమణి , సాన్య మల్హోత్రా, వంటి వారు కీలక పాత్రలలో నటించగా విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. మరోవైపు దీపికా పదుకొణె, స్టార్ హీరో సంజయ్ దత్ గెస్ట్ రోల్స్‌లో కనిపించి కనువిందు చేశారు. అయిదు జవాన్ తమిళ వెర్షన్‌లో యోగి బాబు ఆరోగ్య మంత్రి పీఏ పాత్రను పోషించారు, అయితే హిందీ వెర్షన్ చూస్తే, ముఖేష్ ఛబ్రా (జవాన్ కాస్టింగ్ డైరెక్టర్ కూడా) అదే పాత్రను పోషించారు. నిజానికి సినిమా యొక్క అన్ని వెర్షన్లలో యోగి బాబుని పెట్టి ఉంటె బాగుండేదని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒకరకంగా అలా చేసి ఉంటే యోగిబాబుకు పాన్ ఇండియా అప్పీల్ కూడా వచ్చి ఉండేదని ఎందుకు అట్లీ ఈ విషయంలో యోగిబాబుకు అన్యాయం చేశాడని కొందరు ప్రశ్నిస్తున్నారు కూడా. ఇక అనిరుధ్ రవిచంద్రన్ జవాన్ సినిమాకు సంగీతం అందించగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.