Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananthika Sanilkumar: టాలీవుడ్లో తన ఫస్ట్ సినిమా ‘బలగం’ తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఎల్లమ్మ’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటం సినిమాకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘మ్యాడ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనంతిక సనిల్‌కుమార్, 8 వసంతాలు చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ బుట్టబొమ్మ ‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోయిన్గా నటించడం దాదాపు ఖరారైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు.. మేకర్స్ ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్, అనంతికలపై ఫోటోషూట్ కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ‘ఎల్లమ్మ’ కథ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ దేవిని నమ్ముకుని సంప్రదాయ జానపద కళలను ప్రదర్శించే ఓ కళాకారుల బృందం ఎదుర్కొనే కష్టాలు, వారి జీవన పోరాటాలు, భావోద్వేగాల చుట్టూ ఈ చిత్ర కథ సాగుతుందని సమాచారం. ‘బలగం’ తరహాలోనే పల్లెటూరి నేటివిటీ, బలమైన ఎమోషన్‌ను వేణు యెల్దండి ఈ చిత్రంలో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. రగ్గడ్ హెయిర్ స్టైల్, గడ్డంతో ఆయన కనిపించిన ఇంటెన్స్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంగీత దర్శకుడిగా ఎన్నో హిట్స్ అందుకున్న డీఎస్పీ.. ఈ సినిమాతో హీరోగా ఎలా మెప్పిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్గా అనంతిక పేరు దాదాపు ఖరారైనట్లు వస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్గా, సుమంత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రోమాంచకం చిత్రంతో సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read
- Kangana Ranaut: కంగనా, రామ్‌దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
- Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
- Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
- Race 4: ‘రేస్’ రీబూట్‌లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్‌తో అల్టిమేట్ యాక్షన్ ?
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్‌దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!