Ambajipeta Marriage Band Pre Release Event: సుహాస్ హీరోగా నటిస్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. . ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న క్రమంలో హైదరాబాద్ లో హీరో అడివి శేష్ అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లవుతోంది, ఈ పదేళ్లలో డైరెక్టర్ ను అయ్యేందుకు కొన్ని శాక్రిఫైజ్ లు చేయాల్సి వచ్చింది అయినా ఇండస్ట్రీలోనే ఉన్నాను. వాటికి ఫలితం ఈ సినిమా సక్సెస్ ద్వారా దొరుకుతుందని ఆశిస్తున్నా, ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన గీతా ఆర్ట్స్, బన్నీ వాసు, వెంకటేష్ మహా, ధీరజ్ కి థ్యాంక్స్. సుహాస్ లేకుంటే నేను డైరెక్టర్ గా ఈ స్టేజ్ మీదకు వచ్చేందుకు ఇంకా ఎన్నేళ్లు పట్టేదో తెలియదు.
Fighter : ఓటీటీలోకి వచ్చేస్తున్న హృతిక్ రోషన్ ‘ఫైటర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
“అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా టీజర్, ట్రైలర్ మీకు ఎంతగా నచ్చాయో…సినిమా అంతకంటే బాగుంటుంది. అన్నారు. హీరోయిన్ శివాని మాట్లాడుతూ సుహాస్ ఏమాత్రం ఈగో లేని యాక్టర్ తను ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. తను నా ఫేవరేట్ కోస్టార్, సినిమా మొత్తం హ్యాపీగా షూటింగ్ చేశాం. నితిన్, శరణ్య…మిగతా ఆర్టిస్టులంతా అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు అన్నారు. హీరో సుహాస్ శేష్ కు ఇవాళ కాలు బెణికి బాగాలేదు అయినా ఈవెంట్ కు వచ్చారు, మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలని ఆయన అంటుంటారు. నేను గీతా ఆర్ట్స్ లో హీరోగా చేస్తున్నానంటే మా పేరెంట్స్ నమ్మలేదు. నేను చేసిన మూవీస్ లో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”కు బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చానని చెప్పగలను. అది దర్శకుడు దుశ్యంత్ ఇచ్చిన ప్రతి డీటెయిలింగ్ వల్లే. మీకు ఇష్టమైన సినిమాల లిస్టులో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీ ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా. ఫిబ్రవరి 1నే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. తప్పకుండా చూడండన్నారు.