Yatra 2 Stremaing in Amazon Prime Video: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు రాబోతుందటంతో టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019లో రిలీజైన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 మూవీ తెరకెక్కించాడు.ఫి బ్రవరి 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సీఎం జగన్ గురించి అందరికీ తెలిసిన కథనే దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించిన ఈ సినిమాలో మమ్ముట్టి గెస్ట్ రోల్‌లో కనిపించాడు. వైఎస్ జగన్ జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలతో దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 సినిమా తెరకెక్కించారు.
Poonam Kaur: మూడు పెళ్లిళ్లు అంటూ వైసీపీ నేతకు పూనమ్ కౌర్ కౌంటర్!
తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ వదిలేయడానికి దారి తీసిన పరిణామాలు, సొంత పార్టీ ఏర్పాటుతో పాటు ప్రజల మద్ధతుతో తొలిసారి సీఎంగా ఎలా ఎన్నికయ్యాడు అనేది డైరెక్టర్ మహి వి రాఘవ్ ఎమోషనల్‌గా ఆవిష్కరించారు. అయితే యాత్ర 2 ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి సెకండ్ వీక్‌లో యాత్ర 2 ఓటీటీలోకి రానుందని ప్రచారం జరుగగా చివరికి ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, వైఎస్ భారతి పాత్రలో కేతకీ నారయణన్ నటించారు. యాత్ర 2 మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా పాటలు కూడా వర్కౌట్ అయ్యాయి.