Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో చేస్తోంది. ఈ సినిమాతో ఆమె పాన్ వరల్డ్ స్థాయి సినిమాలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. అలాంటి ప్రియాంక చోప్రాకు తాజాగా ప్రపంచ స్థాయి అవార్డు దక్కింది. ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించే గ్లోబల్ వాన్గార్డ్ హానర్ అవార్డ్కు ప్రియాంక సెలెక్ట్ అయింది. ఈ సంస్థ అందించే అవార్డులు చాలా అరుదైన వారికి మాత్రమే అందిస్తారు. హాలీవుడ్ స్థాయి యాక్టర్లు, గ్లోబల్ స్థాయి లీడర్లకు మాత్రమే అందిస్తారు.
Read Also : Saif Ali Khan : ఆ దేశంలో ఇల్లు కొన్న సైఫ్.. ఫ్యామిలీతో అక్కడికే షిఫ్ట్..
అలాంటి సంస్థ అవార్డుకు ప్రియాంక చోప్రా ఎంపిక కావడంతో ఆమె ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. మే 10న లాస్ ఏంజెల్స్ లోని మ్యూజిక్ సెంటర్ లో జరిగే గోల్డ్ హౌస్ గాలా నాలుగో వార్షికోత్సవ సభలో ప్రియాంకకు ఈ అవార్డు అందజేయబోతున్నారు. ఈ సంస్థ ప్రతి ఏటా 100 మంది ఆసియా, పసిఫిక్ లీడర్లు, యాక్టర్లను ఎంపిక చేస్తోంది. ఆయా రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి దీన్ని అందజేస్తుంది. ఇండియా నుంచి ప్రియాంకకు అవకాశం దక్కింది. ఆమె ఇప్పటికే హాలీవుడ్ లోని ప్రముఖ స్టార్లతో నటించి గ్లోబల్ స్థాయి క్రేజ్ దక్కించుకుంది. ఆ గుర్తింపు ఆమెకు ఇలా కలిసొచ్చింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల్లో బిజీగా ఉంది.