కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతుంది అనే సామెత నీళ్ళకే కాదు ప్రతి విషయానికి వర్తిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా వర్తిస్తుందని చెప్పాలి. ఒక హీరోయిన్ ఇందుస్త్రీలో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టగానే, అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ ని రిప్లేస్మెంట్ దొరికింది అనే మాటలు వినిపిస్తాయి. ఇదే మాట ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక విషయంలో కూడా జరుగుతుంది. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న రష్మికకి యంగ్ హీరోయిన్ శ్రీలీల నుంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎదురయ్యే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మొదటి సినిమాతోనే సినీ వర్గాలతో పాటు సినీ అభిమానుల దృష్టిలో కూడా పడింది.
ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న శ్రీలీల, రీసెంట్ గా ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోని సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో శ్రీలీల యాక్టింగ్ కి, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కి యూత్ ఫిదా అయ్యారు. క్యూట్ గా కనిపించడంతో పాటు అవసరమైతే గ్లామర్ డోస్ పెంచడంలో కూడా వెనక్కి తగ్గేలా కనిపించని శ్రీలీల, ధమాక సినిమాలో డాన్స్ ఇరగదీసింది అనే చెప్పాలి. భీమ్స్ సిసిరీలియో కంపోజ్ చేసిన మాస్ సాంగ్స్ కి శ్రీలీల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూనే డాన్స్ మూమెంట్స్ ని సూపర్బ్ గా పెర్ఫామ్ చేసింది. ధమాకా హైలైట్స్ అనే లిస్ట్ తీస్తే అందులో శ్రీలీలా కూడా ఉంటుంది. రెండో సినిమాతోనే ఇంత పేరు తెచ్చుకోవడంతో టాలీవుడ్ లో శ్రీలీలా బిజీ హీరోయిన్ కాబోతుంది అనే మాట వినిపిస్తోంది. కన్నడ బ్యూటీ రష్మిక తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాలు కూడా చేస్తుంది. రెండు మూడు హిట్స్ బ్యాక్ టు బ్యాక్ కొడితే రష్మిక స్థానంలోకే శ్రీలీలా వచ్చి చేరుతుంది అంటున్నారు.
క్యూట్ అండ్ గ్లామర్ గా కనిపించగలగడం, మంచి డాన్స్ వెయ్యగలగడం, తెలుగు స్పష్టంగా మాట్లాడగలగడం, ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొనడం లాంటి విషయాలు శ్రీలీలా, రష్మికల మధ్య కామన్ గా ఉన్నాయి. ఈ కారణంగానే ఎక్కువ బడ్జట్ పెట్టి రష్మిక సినిమా ఎందుకు చెయ్యాలి, కొత్త హీరోయిన్ శ్రీలీలా ఉంది కదా అనే ఆలోచన మేకర్స్ కి వచ్చినా… ఆల్రెడీ రష్మికతో చేసేసాము కదా కొత్త హీరోయిన్ ని ట్రై చేద్దాం అనే ఆలోచన హీరోలకి వచ్చినా టాలీవుడ్ లో రష్మికకి రిప్లేస్మెంట్ వచ్చేసినట్లే. ప్రస్తుతం శ్రీలీలకి కూడా డిమాండ్ చూస్తుంటే ఆమె స్టార్ హీరోయిన్ అవ్వడానికి పెద్ద టైం పట్టేలా కనిపించట్లేదు.