OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ మూవీ మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఈ సినిమాతో పవన్ కు మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రియాంక అరుల్ మోహన్ గురించే చర్చ జరుగుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు చాలా ఏళ్ల తర్వాత భారీ హిట్ పడింది. ఆ సినిమాతోనే శృతిహాసన్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. దెబ్బకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ఆ బ్యూటీకి.
Read Also : OG : ఓజీకి దూరంగా ఉన్న త్రివిక్రమ్.. కారణం అదేనా..?
ఇప్పుడు ప్రియాంకకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ ఎంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడో.. ఇప్పుడు ఓజీ సినిమాలో అంతకన్నా మాసివ్ పాత్రలో మెరుస్తున్నాడు. పైగా గబ్బర్ సింగ్ కు ముందు శృతిహాసన్ కు అన్నీ ప్లాపులే ఉన్నాయి. ఇప్పుడు ప్రియాంకకు కూడా పెద్దగా హిట్లు లేవు. పైగా స్టార్ హీరోయిన్ స్టేటస్ కు అడుగు దూరంలో ఉంది. ఓజీ గనక పెద్ద హిట్ అయితే అమ్మడు జాతకమే మారిపోతుంది. మరి పవన్ ఫ్యాన్స్ రేపు ఏం చేస్తారో చూడాలి.
Read Also : Sujith : డైరెక్టర్ సుజీత్ భార్యను చూశారా.. హీరోయిన్లు పనికిరారు
