Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే రికార్డులకు మారు పేరు. ఇప్పుడు మర హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బాహుబలితో ఇండియన్ సినిమాల గతిని మార్చేసిన ఈ ఆరడుగుల అందగాడు.. ఇప్పుడు మరో సారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. బాహుబలి వచ్చి పదేళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ హిస్టారికల్ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఎపిక్ బాహుబలి పేరుతో దీన్ని రీరిలీజ్ చేస్తున్నారు. పైగారెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా తెస్తున్నారు. కొన్ని డిలీటెడ్ సీన్లు కూడా యాడ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీని కోసం ప్రభాస్, రానా స్పెషల్ ప్రమోషన్లు చేయబోతున్నారంట.
Read Also : Brahmanandam : ఆర్.నారాయణ మూర్తి ఎవరికీ తలొంచడు.. బ్రహ్మానందం కామెంట్స్
ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది. దాన్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారంట. అలాగే అక్టోబర్ లో నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నాలు వరుస ఈవెంట్లలో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నాలు కలిసి రీయూనియన్ పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్ చేయబోతున్నారంట. ఈ రీరిలీజ్ సినిమాకు కూడా భారీగా ప్రమోషన్లు చేసి భారీగా హైప్ పెంచబోతున్నారంట. దాంతో రీ రిలీజ్ లో కూడా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అంటన్నారు. అసలే బాహుబలికి భారీ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ రెండు పార్టులను కలిపి తీసుకొస్తుండటంతో ఫ్యాన్స్ చూడకుండా ఉంటారా.. పైగా ప్రభాస్ సినిమా వచ్చి ఏడాది గడిచిపోతోంది.. అందుకే ఫ్యాన్స్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. చూస్తుంటే రీ రిలీజ్ లోనూ బాహుబలితో ప్రభాస్ భారీ రికార్డు క్రియేట్ ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Also : Nagarjuna : ఆయన కోసం పార్కుల చుట్టూ తిరిగా.. నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్..