యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. మే 12న గ్రాండ్ గా రిలీజ్ కానున్న కస్టడీ సినిమాకి ఈరోజు రాత్రి నుంచి ఓవర్సీస్ ప్రిమియర్స్ పడనున్నాయి. వెంకట్ ప్రభు మార్క్ స్క్రీన్ ప్లేతో కస్టడీ సినిమా తెరకెక్కింది, ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రామిసింగ్ గా ఉందనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. పాజిటివ్ బజ్ జనరేట్ అవ్వడంతో కస్టడీ సినిమాపై అక్కినేని అభిమానులు భారి ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య కానిస్టేబుల్ శివ అనే పాత్రలో కనిపించనున్నాడు. దాదాపు 27 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది కస్టడీ మూవీ.
Read Also: Suriya: నో.. ఈయన మా సూర్య కాదు.. ఇలా మారిపోయాడేంటి..?
ఇప్పుడున్న పాజిటివ్ వైబ్ కి మంచి టాక్ వస్తే కస్టడీ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమి కాదు. పైగా నాగ చైతన్య మే నెల రిలీజ్ కలిసొచ్చిన హిస్టరీ కూడా ఉంది. మే నెలలో ఇప్పటివరకూ నాగ చైతన్య నాలుగు హిట్స్ ఇచ్చాడు. మే 6న 100% పర్సెంట్ లవ్, మే 10న తడాఖా, మే 23న మనం, మే 26న రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలు చై కెరీర్ లో మంచి హిట్స్ గా నిలిచాయి. ఆ హిస్టరీని రిపీట్ చేస్తూ మే 12న నాగ చైతన్య కస్టడీ సినిమాతో అయిదో హిట్ ఇస్తాడని అక్కినేని ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి మే 12న చైతన్య హిస్టరీ రిపీట్ చేస్తాడా? ఫాన్స్ కి సాలిడ్ కిక్ ఇస్తాడా? అనేది చూడాలి.