Manchu Manoj : మంచు విష్ణు సినిమా కన్నప్ప వాయిదా పడింది. వీఎఫ్ ఎక్స్ వర్క్ లేటు అవుతుందని అందుకే వాయిదా వేస్తున్నామని విష్ణు స్వయంగా కొద్ది సేపటి క్రితమే ప్రకటించాడు. వీఎఫ్ ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతున్నందున వాయిదా వేస్తున్నామన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 25న మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్లు కూడా భారీగా చేస్తున్నారు. విష్ణు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంత చేసి చివరకు ట్విస్ట్ ఇచ్చారు. అయితే అన్న విష్ణు సినిమా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి చూపు తమ్ముడు మనోజ్ నటించిన భైరవం సినిమాపై పడింది. ఈ సినిమాను కూడా విష్ణు కన్నప్పకు పోటీగా దింపుతారనే ప్రచారం జరిగింది.
Read Also : BCCI: సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుపై ఫోకస్.. సమావేశం వాయిదా
ఏప్రిల్ వెండితెరపై చూసుకుందాం అంటూ మనోజ్ చేసిన కామెంట్స్ కూడా సంచలనం అయ్యాయి. కానీ అధికారిక డేట్ మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. కచ్చితంగా ఏప్రిల్ లోనే వస్తారని మాత్రం హింట్ ఇచ్చారు. ఇప్పుడు కన్నప్ప సినిమా వాయిదా పడింది కాబట్టి ఆ డేట్ ఖాళీ అయిపోయింంది. మరి మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన భైరవం సినిమా ఆ డేట్ కు వస్తుందా అనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఒక టీజర్ మాత్రమే వచ్చింది. ప్రమోషన్లు కూడా పెద్దగా ఏమీ చేయట్లేదు. కానీ అన్న లాక్ చేసుకున్న డేట్ కు వచ్చి మనోజ్ హిట్ కొట్టాలనే ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తోంది.