‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుండడంతో అన్ని భాషల్లోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు టీం. ప్రమోషనల్లో భాగంగా రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయడానికి టీం ఏర్పాట్లు చేసుకున్న విషయం తెలిసిందే.
Read Also : Rana Daggubati : కెప్టెన్ మీరు మళ్ళీ సాధించారు… జక్కన్నపై ఆసక్తికర ట్వీట్
ఈ మేరకు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ బృందం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం మొత్తం పాల్గొంది. అయితే ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి KGF 2 బాహుబలి కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా ? అని అడిగారు. దానికి యష్ స్పందిస్తూ ఏదైనా ఒక సినిమా వస్తే అంతకుముందున్న రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేయాలి. దాన్ని ప్రోగ్రెస్ అంటారు. ఎదో ఒక రికార్డు క్రియేట్ అయ్యిందంటే దాన్నే పట్టుకుని కూర్చోవద్దు మేము. కలెక్షన్లు, రికార్డులు మారుతూ ఉంటాయి. కానీ ప్రేక్షకుల ప్రేమ ఎంత ఉంది ? అనేదే ముఖ్యం. ఆ దేవుడు ఏం డిసైడ్ చేస్తే అదే అవుతుంది” అని చెప్పుకొచ్చారు .మరి KGF 2 బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా ? అనేది చూడాలి.