Jayam Ravi : తమిళ హీరో జయంరవి, అతని భార్య ఆర్తి వివాదం ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీసింది. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. విడాకులు కావాలని చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో పిటిషన్లు వేశారు. తాజాగా ఆ కేసు విచారణకు ఇరువురూ కోర్టులో హాజరయ్యారు. కలిసి ఉండాలని అందుకోసం కౌన్సెలింగ్ కు హాజరు కావాలంటూ కోర్టు సూచించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో తన భార్యతో కలిసి ఉండలేనని జయంరవి తెగేసి చెప్పేశాడు. దాంతో జయం రవి భార్య ఆర్తి కూడా అదే బాట పట్టింది.
Read Also : Kothalavadi: యష్ తల్లి నిర్మాతగా ‘కొత్తలవాడి’ .. టీజర్ భలే ఉందే!
అయితే తనకు భరణం కింద నెలకు రూ.40లక్షలు ఇవ్వాలంటూ భార్య ఆర్తి పిటిషన్ వేసింది. దీనిపై విచారణను జూన్ 12కు వాయిదా వేసింది కోర్టు. ఈ పిటిషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జయం రవి అంత ఇవ్వడానికి ఒప్పుకుంటారా లేదా అన్నది తెలియాలి. కానీ భరణం కింద నెలకు అంత అంటే మరీ టూ మచ్ అంటున్నారు నెటిజన్లు. జయంరవి ఇప్పుడు సినిమాల పరంగా స్లో అయిపోయాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయన నుంచి పెద్ద హిట్ వచ్చి చాలా రోజులు అవుతోంది.
ఇక జయం రవిపై భార్య, అత్త వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. తమను మోసం చేశాడని.. తమకు ఇష్టం లేకపోయినా విడాకులు ఇస్తున్నాడంటూ చెబుతున్నారు. జయం రవి అత్త తనను నిర్మాతగా సినిమాలు తీయాలంటూ చెప్పి.. వంద కోట్ల అప్పులు చేయించాడని ఆరోపిస్తోంది. ఇప్పుడు తానే వాటిని తీరుస్తున్నాను అని చెప్పుకొచ్చింది. వాళ్లు చెప్పేది అవాస్తవాలే అంటూ జయంరవి చెబుతున్నాడు.
Read Also : Pawan Kalyan : ‘సత్యాగ్రహి’ సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..