గత కొన్ని రోజుల నుంచి టక్ జగదీష్ వర్సెస్ లవ్ స్టోరీ కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న “లవ్ స్టోరీ” థియేటర్లలో విడుదల అవుతోంది. అదే రోజున నాని “టక్ జగదీష్” ఓటిటి బాటను ఎంచుకుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ నానిని, చిత్రబృందాన్ని ఏకి పారేశారు. ఆ తరువాత తాము ఎవరినీ కించపరడానికి లేదా బాధ పెట్టడానికి ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలుపుతూ సారీ చెప్పారు. ఈ నేపథ్యంలో “టక్ జగదీష్” నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ఓ స్పెషల్ లెటర్ ను విడుదల చేసింది. అందులో “మంచి సినిమా అందించడానికి, తెలుగు ప్రేక్షకులను వినోదాత్మకంగా ఉంచడానికి షైన్ స్క్రీన్స్ ను స్థాపించాము. మా సూపర్ హిట్ మూవీ “మజిలీ” తర్వాత నేచురల్ స్టార్ నానితో “టక్ జగదీష్”ని ప్రారంభించాము. రెండున్నర సంవత్సరాలుగా మేము జాగ్రత్తగా పెంచి పోషించిన సినిమా మా బిడ్డ “టక్ జగదీష్”. గత ఏడాది డిసెంబర్‌లో సినిమా పూర్తయింది. దీనిని వేసవికి విడుదల చేయాలనుకున్నాము. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ చేయలేకపోయాము. సెకండ్ వేవ్ తరువాత కూడా వివిధ సమస్యలు వచ్చాయి. అంతేకాకుండా ఈ డిజిటల్ యుగంలో ఇంత కాలం కంటెంట్‌ని కాపాడుకోవడం అంత సులభం కాదు.
Read Also : “భోళా శంకర్” నుంచి “రాఖీ” స్పెషల్ సర్ప్రైజ్
పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయనే విషయంలో స్పష్టత లేదు. దీంతో మా ముందు వేరే మార్గం లేక మేము నానిని సంప్రదించి నాన్ థియేట్రికల్ విడుదల కోసం ఒప్పించాము. ఆయనకి డిజిటల్ రిలీజ్ ఇష్టం లేకపోవడంతో ఈ విషయంపై ముందుగా అయిష్టత వ్యక్త పరిచాడు. కానీ తర్వాత నాని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. నిర్మాతల సమస్యలను పరిగణనలోకి తీసుకుని, బాగా ఆలోచించి నాన్ థియేట్రికల్ రిలీజ్ కు అంగీకరించాడు. ఈ సందర్భంగా మేము ఆయనకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా డైరెక్టర్ కూడా మా సమస్యలను అర్థం చేసుకుని మా అభ్యర్థనను అంగీకరించారు. ఫిల్మ్ మేకింగ్‌పై మాకు మక్కువ ఎక్కువ. పెద్ద స్క్రీన్‌లలోనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని ఎప్పుడూ కోరుకుంటాము. మా ప్రధాన లక్ష్యం ఇప్పుడు “టక్ జగదీష్”కు ప్రేక్షకులు 100% చేరువ కావడమే. అందరూ అర్థం చేసుకుని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము” అంటూ సుదీర్ఘ పోస్ట్ చేశారు. మొత్తానికి టక్ జగదీష్ ఓటిటి విడుదలపై ఇలా క్లారిటీ ఇచ్చాడు.
#TuckJagadish pic.twitter.com/7cxE9GC2Pu
— Shine Screens (@Shine_Screens) August 22, 2021