Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పెద్ది సినిమా రిలీజ్ అయి థియేటర్స్ లో రన్ అవుతోంది. దీంతో రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చ మొదలైంది. ఇప్పటికే ఆర్సీ 17ని సుకుమార్ దర్శకత్వంలో ప్రకటించారు చరణ్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్ కావడంతోఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. అయితే పెద్ది సినిమా విడుదలైన వెంటనే ఆర్సీ 17 షూటింగ్ ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. దానికి కారణం లేకపోలేదు.
గతంలోలాగా ఒక సినిమా పూర్తి కాగానే వెంటనే మరో సినిమా మొదలు పెట్టకుండా.. కాస్త సమయం తీసుకొని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నాడట చరణ్. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను నిదానంగా, పర్ఫెక్ట్గా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఆర్సీ17 డిలే అవడానికి మరో బలమైన రీజన్ మాత్రం.. రామ్ చరణ్ సర్జరీ అని తెలుస్తోంది. ‘పెద్ది’ సినిమాలో కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చరణ్ చేతికి గాయాలయ్యాయి. ఆ సమయంలో సినిమా ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో అలాగే షూటింగ్ పూర్తి చేశాడు చెర్రీ. ప్రస్తుతం పెద్ది విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండటంతో చరణ్ తన చేతికి ఒక చిన్న సర్జరీ చేయించుకోబోతున్నట్లు సమాచారం. ఈ సర్జరీ పూర్తయిన తర్వాత వైద్యుల సలహా మేరకు చరణ్ పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. దాదాపు మూడు నెలల పాటు రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉందని టాక్. ఈ బ్రేక్ తర్వాతే RC17 పై పూర్తి దృష్టి పెట్టనున్నారట. మరోవైపు, ఈ గ్యాప్‌లో దర్శకుడు సుకుమార్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు.
Also Read
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!