Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు ఏమైంది.. ? ఆయన ఎందుకు ఇంత గ్యాప్ ఇస్తున్నారు..? సినిమాలు ఎందుకు చేయడం లేదు..? అసలు ఇప్పుడు నాగ్ చేతిలో ఉన్న సినిమాలు ఏంటి..? ఇవన్నీ అక్కినేని అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్నలు. గతేడాది మొత్తంలో అక్కినేని హీరోల నుంచి వచ్చిన సినిమాలు నాలుగు. బంగార్రాజు, ఘోస్ట్, థాంక్యూ, లాల్ సింగ్ చద్దా. నాలుగు డిజాస్టర్ టాక్ ను అందుకున్నాయే. గతేడాది అక్కినేని కుటుంబానికి అస్సలు కలిసిరాలేదని చెప్పాలి. ఇక టాలీవుడ్ లో సీనియర్ హీరోల హవా నడుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. కుర్ర హీరోలకు ధీటుగా ఒక్కో హీరో చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని వరుస షూటింగులతో బిజీగా మారారు. కానీ గతేడాది నుంచి నాగ్ ఒక్క సినిమాను కూడా ప్రకటించింది లేదు. ఇప్పుడు కూడా నాగ్ చేతిలో ఉన్నది ఒకే ఒక్క సినిమా.. అది కూడా కన్ఫర్మేషన్ లేదు.
రచయిత బెజవాడ ప్రసన్న కుమార్.. నాగ్ కు ఒక కథ వినిపించాడని, ఆయన దర్శకత్వంలో నాగ్ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఆ కథ ఏమైందో కూడా తెలియదు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ లో అక్కినేని కుటుంబం తప్ప మిగతా మూడు కుటుంబాలు పాన్ ఇండియా రేంజ్ కు రీచ్ అయ్యాయి. అసలు అక్కినేని హీరోలు పాన్ ఇండియా వరకు వెళ్లడం కన్నా ముందు వరుస సినిమాలు తీస్తే చాలు అని అభిమానులు కోరుకుంటున్నారు. నాగ్ సైతం బిగ్ బాస్ తరువాత అడపాదడపా ఈవెంట్లో కనిపించడం తప్ప సినిమా షూటింగ్స్ లో ఉంటున్నట్లు కూడా వార్తలు రావడం లేదు. అసలు ఎందుకు నాగ్ కు ఏ మౌనం.. ఈ గ్యాప్..? అనేది తెలియడం లేదంటున్నారు అభిమానులు. నాగార్జున నిద్రలో ఉన్నావా ..? లేవయ్యా..? సీనియర్ హీరోలు దూసుకెళ్తున్నారు.. ఒక్క సినిమా అయినా ప్రకటించు అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి అభిమానుల కోరిక విని అయినా నాగ్ మేలుకుంటాడేమో చూడాలి.