సీఎం జగన్‌ను చిరంజీవి కలిసింది కేవలం సినీ పరిశ్రమపై చర్చించటం కోసమేనని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈ విషయాన్ని కూడా ఎందుకు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారో అర్థం అవ్వడం లేదన్నారు. అలా ఎందుకు చేస్తారో కూడా తెలియడం లేదని మంత్రి మండిపడ్డారు. కేవలం సినిమా వాళ్ల కోసమే చిరంజీవి వస్తే ఏదో ఒక రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. సీఎం జగన్ అన్నదమ్ములను విడదీసి రాజకీయం…
టాలీవుడ్ సమస్యలకు సంబంధించి సీఎం జగన్ తో భేటీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. స్వయంగా సీఎం ఆహ్వానం మేరకే సినిమా బిడ్డగా భేటీకి వచ్చానంటూ చిరంజీవి చెప్పారు. అయితే సీఎం జగన్, చిరంజీవి ఈ లంచ్ భేటీలో అసలేం చర్చించబోతున్నారు ? చాలా రోజులుగా సమస్యలతో సతమతమవుతున్న టాలీవుడ్ కు ఈ భేటీతో ఊరట లభిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపటి క్రితం బేగంపేట నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో విజయవాడకు బయలుదేరిన చిరంజీవి గన్నవరం విమానాశ్రయానికి…