‘రౌడీ బాయ్’తో లిప్ లాక్ పై మీమ్స్… అనుపమ రియాక్షన్

దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి, బబ్లీ బ్యూటీ అనుపమ పమేశ్వరన్ జంటగా నటించిన ‘రౌడీ బాయ్స్’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్‌లో అనుపమ లిప్‌లాక్‌తో సహా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ అసలు అనుపమలో అలాంటి యాంగిల్ ను అస్సలు చూడని ఆమె అభిమానులు, ప్రేక్షకులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా ఆమె ముద్దు సన్నివేశంపై అనేక మీమ్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్న తన లిప్ లాక్ మీమ్స్ పై అనుపమ తాజాగా స్పందించింది.

Read Also : కల నెరవేరింది అంటూ మోహన్ బాబు కీలక ప్రకటన

“రౌడీ బాయ్స్” లీడ్ పెయిర్ ఆ మీమ్స్ ను చూసి, అభిమానుల క్రియేటివిటీకి, వాళ్ల వ్యాఖ్యలకు బిగ్గరగా నవ్వేశారు. తరువాత అనుపమ లిప్‌లాక్ సినిమాలో ఒక భాగం మాత్రమే అని అభిమానులను ఊరడించే ప్రయత్నం చేసింది. సినిమాలో తన పాత్రను ముద్దు పెట్టింది ఆశిష్ పాత్ర అని చెప్పింది. సినిమాలోని ఆ సీన్స్ చూస్తే నెటిజన్లు మనసు మార్చుకుంటారని కూడా ఈ జంట హామీ ఇచ్చింది. ఈ మేరకు ఏకంగా ఓ వీడియోను విడుదల చేశారు ఇద్దరూ కలిసి. లిప్ లాక్ సంచలనాన్ని కూడా సినిమా ప్రమోషన్స్ లా మార్చేసుకున్నారు ‘రౌడీ బాయ్స్’. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Articles

Latest Articles