Akkineni Heroes: ఈ అక్కినేని హీరోలకి ఏమైంది? ఎవరూ హిట్టుకొట్టరేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని హీరోలు అనగానే బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, సూపర్బ్ సాంగ్స్, హీరో అనే పదానికి పర్ఫెక్ట్ గా సరిపోయే కటౌట్స్ ఉన్న హీరోలు గుర్తొస్తారు. ఏఎన్నార్ నుంచి అఖిల్ వరకూ ప్రతి అక్కినేని హీరో చాలా అందంగా కనిపిస్తూ, అమ్మాయిలని అభిమానులుగా మార్చుకుంటూ ఉంటారు. ఈరోజుకీ గర్ల్స్ లో నాగార్జునకి ఉన్న ఫాలోయింగ్ యంగ్ హీరోలకి కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ లో ఒకటైనా కూడా అక్కినేని హీరోలు ఏ రోజూ ఏ కాంట్రవర్సీల జోలికి వెళ్లరు. తమ సినిమాలు చేసుకుంటారు, ఏవో వ్యాపారాలు చేసుకుంటారు, అభిమానులని అలరిస్తారు అంతే. ఇది మాత్రమే తెలిసిన అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ లు గతేడాదిగా అభిమానులని డిజప్పాయింట్ చేస్తున్నారు. ముందుగా నాగార్జున గురించి మాట్లాడుకుంటే… కింగ్ నాగ్ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. 2018 నుంచి ఆయన నటించిన ఆరు సినిమాల్లో హిట్ అయ్యింది ఒక్కటే… ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు మినహా నాగార్జున లిస్టులో హిట్ అనే పదం చూసి చాలా రోజులే అయ్యింది.
ఇక అఖిల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డెబ్యు నుంచి కెరీర్ కష్టాలని ఫేస్ చేస్తున్న అఖిల్, MEB సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కినట్లే కనిపించాడు కానీ ‘ఏజెంట్’ సినిమా మళ్లీ దెబ్బేసింది. అయ్యగారిని మళ్లీ రీలాంచ్ చెయ్యండి, అయ్యగారు మీరు IPLలోకి వెళ్లిపోండి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అంటే అది ఏజెంట్ సినిమా పుణ్యమే. ఈ మూవీ కోసం అఖిల్ ఎంత కష్టపడినా, కథలో విషయం లేకపోవడంతో నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. అక్కినేని హీరోల్లో బెటర్ ఫేజ్ లో ఉన్నది నాగ చైతన్య మాత్రమే. ఈ యువసామ్రాట్ నటించిన లాస్ట్ 6 మూవీస్ లో 3 హిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న కస్టడీపైన కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అయితే నాగ చైతన్య నటించిన లాస్ట్ మూవీ ‘థాంక్యు’ మాత్రం అక్కినేని ఫాన్స్ కి కూడా డిజప్పాయింట్ చేసింది. కస్టడీ సినిమాతో ఆ డిజప్పాయింట్మెంట్ కి చైతన్య ఎండ్ కార్డ్ వేస్తాడని ఫాన్స్ నమ్ముతున్నారు. మరి ఈ నమ్మకాన్ని నాగార్జున, అఖిల్ లు ఎప్పుడు కలిగిస్తారు? లాస్ట్ మూడు సినిమాలతో ఫ్లాప్స్ ని ఇచ్చిన ముగ్గురు అక్కినేని హీరో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఎప్పుడు ఇస్తారు? అనేది చూడాలి.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
తాజావార్తలు
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
-
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
-
Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
-
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
-
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!