Item Songs: బాలీవుడ్లో తొలి ఐటమ్ సాంగ్ ఏది?.. ఈ ట్రెండ్ ఎలా మొదలైందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Item Songs: ఈరోజు బాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడితే ఐటమ్ సాంగ్స్ ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ‘మున్నీ బద్నామ్ హుయీ’, ‘షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’, ‘ఓం అంత్వా’, ‘ఆజ్ కీ రాత్’ వంటి పాటలు సినిమాలకు ఎంతటి క్రేజ్ తీసుకొచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కేవలం వినోదం కోసం జోడించే ఈ ఐటమ్ సాంగ్స్ , ఇప్పుడు సినిమా ప్రమోషన్ లలో కూడా కీలకంగా మారాయి. ఐటమ్ సాంగ్ హిట్ అయితే సినిమా కూడా హిట్ అవుతుందనే భావన దర్శకులలో కూడా పెరిగిపోయింది. ఈ ఐటమ్ సాంగ్ సంస్కృతికి అసలు ఆరంభం ఎక్కడ జరిగింది? మొదటి ఐటమ్ డ్యాన్సర్ ఎవరు? ‘ఐటమ్ నంబర్’ అనే పదం ఎప్పుడు పుట్టింది? అనే ప్రశ్నలకు సమాధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఇండియన్ హిస్టరీలో కథకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా నృత్య ప్రదర్శనను చూపించే సంప్రదాయం కొత్తది కాదు. దాని చరిత్ర తెలుసుకోవాలంటే 1930ల కాలానికి వెళ్ళాల్సిందే. అప్పట్లో అన్నా మేరీ గెలర్ అలియాస్ అజూరి హిందీ సినిమాలలో ప్రత్యేక సోలో డ్యాన్స్ ర్ గా గుర్తింపు పొందారు. ఆమెను భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి ఐటమ్ డ్యాన్సర్‌గా గుర్తిస్తారు పలువురు సినీ చరిత్రకారులు. అయితే ఆమె నటించిన సినిమాల విజువల్ రికార్డులు ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా, సినిమాల్లో కథకు భిన్నంగా ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఇచ్చిన తొలి నటీమణుల్లో ఆమె ఒకరని సినీ చరిత్ర చెబుతోంది.
Also Read
- Ramayan: 'రామాయణం'లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
- Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ 'జన నాయగన్' స్క్రీనింగ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు!
- Dharmakshetra: టాలీవుడ్లో సరికొత్త చరిత్ర: 30 రోజుల్లోనే భారతదేశపు తొలి ఏఐ ఇండిపెండెంట్ మూవీ "ధర్మక్షేత్ర" ముస్తాబు!
- Anna Konidela: మంచి మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్ భార్య.. పుట్టినరోజు సందర్భంగా ఏం చేశారంటే!
ఆతరువాత 1940, 1950 దశకాల్లో కుకు మోర్ ఈ ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లారు. ఆమె ఎనర్జీతో కూడిన క్యాబరే డ్యాన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాలీవుడ్లో ఐటమ్ డ్యాన్స్ కు కొత్త గుర్తింపు తీసుకొచ్చాయి. ఆమె శరీర ఆకృతిని, డ్యాన్స్ ను చూసి చాలా మంది ఆమెని ‘రబ్బర్ గర్ల్’ అని పిలిచేవారు. ‘బర్సాత్’లోని ‘పత్లీ కమర్ హై’, ‘చల్తీ కా నామ్ గాడీ’లోని ‘హమ్ తుమ్హారే హై జరా’ వంటి పాటలు అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. ఇదే సమయంలో కుకు మోర్, తర్వాత క్యాబరే క్వీన్‌గా ఆస్థానాన్ని హెలెన్ సొంతం చేసుకున్నారు.
1958లో విడుదలైన ‘హౌరా బ్రిడ్జ్’ సినిమాలో ‘మేరా నామ్ చిన్ చిన్ చూ’ పాటతో హెలెన్ భారతీయ సినిమాల్లో క్యాబరే డ్యాన్స్‌కు కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘పియా తు అబ్ తో ఆజా’, ‘మెహబూబా మెహబూబా’ వంటి పాటలు ఆమెను బాలీవుడ్లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఎన్నో దశాబ్దాల పాటు ఐటమ్ సాంగ్ లకు హెలెన్ ఒక బ్రాండ్‌గా మారిపోయారు. అయితే ‘ఐటమ్ నంబర్’ అనే పదం మాత్రం చాలా తర్వాత ప్రాచుర్యంలోకి వచ్చింది. 1999లో విడుదలైన ‘షూల్’ సినిమాలో శిల్పా శెట్టి నటించిన ‘మై ఆయీ హూ యూపీ బీహార్ లూట్నే’ పాటను మీడియా తొలిసారిగా ‘ఐటమ్ నంబర్’గా పేర్కొన్నట్లు సినీ వర్గాల్లో భావిస్తారు. ఆ తర్వాత ఈ పదమే అన్నిచోట్లా ఊతపదంగా మారిపోయింది.
1988లో ‘ఏక్ దో తీన్’ పాటతో మాధురీ దీక్షిత్, 1998లో ‘చయ్యా చయ్యా’తో మలైకా అరోరా ప్రత్యేక నృత్య గీతాలకు మరింత స్టార్డమ్ తీసుకొచ్చారు. అనంతరం కత్రినా కైఫ్ నటించిన ‘షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’, కరీనా కపూర్ ‘ఫెవికాల్ సే’, సమంత ‘ఓం అంత్వా’ వంటి పాటలు ఐటమ్ సాంగ్స్‌ను సినిమా మార్కెటింగ్‌లో కీలక భాగంగా మార్చేశాయి. అయితే బాలీవుడ్ లో ఊపందుకున్న ఐటమ్ సాంగ్స్ ప్రాసెస్ ఆతరువాత అన్ని భాషల్లో జోరందుకుంది. సినిమా ప్రమోషన్, బాక్సాఫీస్ హైప్, సోషల్ మీడియా ట్రెండ్లకు ఇవి కీలకంగా మారాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు కూడా తమ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా భావించే స్థాయికి ఐటమ్ సాంగ్స్ చేరుకున్నాయి. దాదాపు తొమ్మిది దశాబ్దాల ప్రయాణంలో ఐటమ్ సాంగ్స్ సినీ సంస్కృతిలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయాయి.
- Tags
- cinema
- item songs
తాజావార్తలు
-
Jurala Project: ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. జూరాల ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
-
Ramayan: ‘రామాయణం’లో రణబీర్ కపూర్ పారితోషికం150 కోట్లు.. ఒక్క రూపాయి కూడా తీసుకోని స్టార్ ఎవరో తెలుసా ?
-
Tecno 0mm Bezel Smartphone: స్క్రీన్ చుట్టూ బెజెల్స్ మాయం! 0mm డిస్ప్లే బోర్డర్‌తో టెక్నో కొత్త కాన్సెప్ట్ ఫోన్
-
RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!