Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అసలు వయసుతోనే సంబంధం లేదంటూ యంగ్ హీరోల కంటే స్పీడుగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత రెండు సినిమాలను లైన్ లో పెట్టేశారు. ఇద్దరు ట్యాలెంటెడ్ డైరెక్టర్లు అయిన శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడితో సినిమాలను కన్ఫర్మ్ చేశారు. విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది లోనే అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి అయిపోయాయి. అనిల్ వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు.
Read Also : Bihar: ‘‘డ్యాన్స్ చేస్తావా లేదా సస్పెండ్ చేస్తా’’.. పోలీసులపై లాలూ కుమారుడి జులుం..
అదే జోష్ తో మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా వింటేజ్ చిరంజీవిని చూపించేలా కథ రెడీ చేసుకున్నాడంట. ఇందులో హీరోయిన్ కోసం చాలా మందిని అనుకుంటున్నారంట. కానీ చిరు పక్కన సెట్ కారేమో అని కొందరిని రిజెక్ట్ చేస్తున్నాడంట అనిల్. అదితిరావు హైదరీ పేరు తెరమీదకు వచ్చినా ఆమె సెట్ కాదేమో అని హోల్డ్ చేశారంట. సీనియర్ హీరోయిన్ తమన్నా అయితే బాగుంటుందని అనిల్ డిసైడ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. పైగా చిరు పక్కన ఇప్పటికే ఆమె రెండు సినిమాలు చేసింది. అనిల్ డైరెక్షన్ లో తమన్నా బాగా సెట్ అవుద్ది. ఇందులో హీరోయిన్ పాత్ర ఇంపాక్ట్ కూడా బాగానే ఉంటుందంట. అందుకే తమన్నా పేరునే చిరంజీవి వద్ద ఉంచాడంట అనిల్. త్వరలోనే ఆమెను కన్ఫర్మ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.