‘ఆర్ఆర్ఆర్’ తెరపైకి రావడానికి కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఓవర్సీస్ ప్రీమియర్‌లను లెక్కలోకి తీసుకుంటే ఐదు రోజులే! గత కొన్ని వారాలుగా టీమ్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ త్రయం మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లను నిర్వహించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈవెంట్ గురించి చడీచప్పుడూ లేకుండా ఉంది టీమ్. దీంతో ఇక్కడ ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ? అంటూ ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.
అవన్నీ పుకార్లుగానే మిగులుతాయా ?
తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ లేదట. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సినిమాపై స్కై హై హైప్ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాను ప్రమోట్ చేయడం గురించి కాదు గానీ… ఈవెంట్ గనుక జరిగితే ప్రేక్షకులు, అభిమానుల్లో మరింత ఉత్సాహం వస్తుంది. గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గాను గనుక మేకర్స్ నిర్వహిస్తే… కొనసాగుతున్న కోవిడ్ పరిస్థితిలో చాలా మంది అభిమానులు హాజరవుతారు. జనవరి మొదటి వారంలో ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ జరగనుందని, ఈ వేడుకకు బాలయ్య, చిరు అతిథులుగా విచ్చేస్తారని పుకార్లు వచ్చాయి. అయితే దీని గురించి ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి ఇప్పటిదాకా ఎటువంటి క్లారిటీ లేదు.
Read Also : జపాన్ లో ప్రభాస్ ని ఇలా కూడా వాడేస్తున్నారా? సూపర్ క్రేజ్!
తెలుగు ప్రేక్షకులను నిరాశేనా ?
భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని బహిరంగ సభలను నిషేధించాయి ప్రభుత్వాలు. దీంతో ఈ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి అనుమతులు మంజూరు కాకపోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే ‘ఆర్ఆర్ఆర్’ బృందం ప్రీ రిలీజ్ కు బదులుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌తో ముందుకు సాగుతుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్‌లపై క్లారిటీ లేదు. మరోవైపు మేకర్స్ డైరెక్ట్ గా సినిమా విడుదల తర్వాత గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ కాకుండా మేకర్స్ ను ఆలోచింపజేస్తున్న మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఏపీలో కొత్త టిక్కెట్ రేట్ల ప్రకారం వ్యాపారాన్ని సవరించాలని డిస్ట్రిబ్యూటర్లు డీవీవీ దానయ్యను కోరినట్లు టాక్ వినిపిస్తోంది.
సంతోషించాల్సిన విషయం ఏమిటంటే… గత కొన్ని రోజులుగా వివిధ కారణాల వల్ల మూసివేసిన థియేటర్లు ఆంధ్రాలో మళ్ళీ తెరుచుకున్నాయి. థియేటర్ల యజమానులు తమ సినిమా హాళ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఆంధ్రా ప్రభుత్వం నుంచి 30 రోజుల గడువు లభించింది. అలాగే తెలంగాణాలో కొత్త జిఓ ప్రకారం టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో గరిష్టంగా రూ.295, సింగిల్ స్క్రీన్‌లలో రూ.175 టికెట్ రేట్లు ఉండొచ్చు.