యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత వచ్చిన రీచ్ అసలు ఏ ఇండియన్ హీరో కలలో కూడా ఊహించి ఉండడు. ఈరోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది అంటే దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నిటికంటే అతిపెద్ద కారణం ఇంటర్వెల్ బ్లాక్. ఎన్టీఆర్ ట్రక్ లో నుంచి పులులతో దూకితే, అలాంటి విజువల్ ని అవెంజర్స్ సినిమాలో కూడా చూడని వెస్ట్రన్ ఆడియన్స్ స్టన్ అయ్యారు. ఆ సీన్ వైరల్ అయిన దగ్గరి నుంచే ఆర్ ఆర్ ఆర్ సినిమా రీచ్ విపరీతంగా పెరిగింది. అప్పటి నుంచే ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ అయ్యింది. అలాంటి ఎన్టీఆర్ ని యష్ రాజ్ ఫిల్మ్స్ తమ స్పై యూనివర్స్ లో భాగం చెయ్యడానికి రెడీ అయ్యారు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనే వార్త మే 20న అఫీషియల్ గా అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. వార్ సినిమాకి సీక్వెల్ గా రూపొందనున్న వార్ 2లో హృతిక్ vs ఎన్టీఆర్ ఫైట్ ని చూసే ఛాన్స్ ఉందని బాలీవుడ్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి.
ఈ నేపధ్యంలో వార్ 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది, దీనికి కారణం ఎన్టీఆర్ ఫాన్స్ కాకుండా మెగా ఫాన్స్ అవ్వడం విశేషం. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కి పోటీగా, ఎన్టీఆర్ ప్లేస్ లో రామ్ చరణ్ ఉంటే బాగుంటుంది… రామ్ చరణ్ వార్ 2లో చేస్తే బాగుంటుంది అని మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ముంబైలో ప్రముఖ సింగల్ స్క్రీన్ థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ కూడా రామ్ చరణ్ వార్ 2 సినిమాలో నటిస్తే హిందీ సినిమాకి సౌత్ లో మంచి మార్కెట్ ఓపెన్ అవుతుంది అని మాట్లాడడంతో మెగా ఫాన్స్, మనోజ్ దేశాయ్ స్పీచ్ ని మరింత వైరల్ చేస్తున్నారు. వీరికి కౌంటర్ వేస్తూ నందమూరి ఫాన్స్ కూడా ట్వీట్స్ చేస్తుండడంతో వార్ 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
నిజానికి ఆల్మోస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ గురించి తమ హీరో చేస్తే బాగుంటుంది అనే కామెంట్స్ చెయ్యడం అనేది హిందీ చిత్ర పరిశ్రమ దృష్టిలో మనల్ని మనమే తక్కువ చేసుకున్నట్లు ఉంటుంది. ఏ కథకి ఏ హీరో, ఏ కాంబినేషన్ కి ఎన్ని కోట్లు వస్తాయి లాంటి విషయాలని దర్శక నిర్మాతలు లెక్కేసుకున్న తర్వాతే సినిమా మొదలవుతుంది. అలానే వార్ 2 సినిమాలోకి, యష్ రాజ్ స్పై యూనివర్స్ లోకి ఎంటర్ అయ్యాడు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ సినిమాలో మన హీరో ఉన్నాడు అని సంతోషించాల్సిన విషయాన్ని గొడవలు పడి ఫాన్స్ ఎంజాయ్ చెయ్యకుండా ఉంటున్నారు.