వార్ 2, కూలీ ఈ రెండు భారీ సినిమాలు రిలీజ్ కు ముందు ఎంత హైప్ తెచ్చుకున్నాయో రిలీజ్ అయ్యాక అంతే స్థాయిలో నెగిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. వార్ 2 కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కూలీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. రెండు సినిమాలు మొదటి నాలుగు రోజులు బాగానే వసూళ్లు రాబట్టాయి. కూలీ నాలుగు రోజులకు గాను రూ. 404 కోట్లు గ్రాస్ రాబట్టగా వార్ 2 రూ. 270 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
Also Read : Tollywood Bandh : సినీ కార్మికుల 16వ రోజు సమ్మె.. నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం..
వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ రావడంతో ఆ మాత్రం రాబట్టాయి.. కానీ నిన్న ఫస్ట్ వర్కింగ్ డే సోమవారం నాడు కూలీ, వార్ 2ల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఇండియా వైడ్ గా కూలీ రూ. 12 కోట్లు రాబట్టగా వార్ 2 రూ.6.5 కోట్లు మాత్రమే రాబట్టాయి. తెలుగు రాష్ట్రల్లో ఈ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ముఖ్యంగా నైజాంలో కూలీ మినిమమ్ షేర్ రాబట్టగా వార్ 2 డెఫిషిట్ లో నడుస్తోంది. ఉన్నంతలో కూలీ తమిళనాడులో కాస్త బెటర్ అని చెప్పాలి. అక్కడ ఐదవ రోజు రూ.7.80 కోట్లు షేర్ రాబట్టింది. కన్నడలో రూ. 0.18 లక్షలు రాబట్టింది. ఇక వార్ 2 తమిళ్, కన్నడలో ఆల్మోస్ట్ వాషౌట్ అనే చెప్పాలి. ఇక ఓవవర్శిస్ లోని నార్త్ అమెరికాలో కూలీ తమిళ్, హిందీ వర్షన్ కలిపి $87,815 వసూలు చేయగా వార్ 2 హిందీ, తెలుగు వర్షన్స్ $106,108 రాబట్టింది. అక్కడ కూడా రెండు సినిమాలు హ్యుజ్ డ్రాప్ అయ్యాయి. రెండు సినిమాలు ఆల్మోస్ట్ థియేటర్ రన్ ముగిసినట్టే. రెండు సినిమాలు నష్టాలతోనే క్లోజింగ్ అవబోతున్నాయి.