Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ – ‘వాల్తేరు వీరయ్య’ రెండూ రెండే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waltair Veerayya Veera Simha Reddy Both Got UA Certificate: ఇప్పటి వరకూ తెలుగు చిత్రసీమలో కనీవినీ ఎరుగని రీతితో ఈ సారి సంక్రాంతి సందడి సాగనుంది. ఎందుకంటే, ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీస్’ నిర్మించి, ఒక్క రోజు తేడాతో విడుదల చేయడం విశేషంగా మారింది. ఇలాంటి పోటీ గతంలో ఎన్నడూ సాగలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరితోనూ సినిమాలను తీయడమే కాదు, ఆ రెండు చిత్రాలను ఒక్క రోజు తేడాతో విడుదల చేసే అతి సాహసానికి శ్రీకారం చుట్టారు ‘మైత్రీ మూవీస్’ అధినేతలు యెర్నేని నవీన్, వై. రవిశంకర్. ఒకే సంస్థ నుండి వస్తోన్న ఈ రెండు చిత్రాలలో ఒకే హీరోయిన్ శ్రుతి హాసన్ నటించడం మరో విశేషం! కాగా ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో ఇంకో విశేషం చోటు చేసుకుంది. ఈ రెండు చిత్రాలకు సెన్సార్ నుండి కూడా ఒకే రకమైన ‘యు/ఏ’ సర్టిఫికెట్ లభించడమే ఆ విశేషం!
జనవరి 12వ తేదీన ముందుగా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ విడుదలవుతోంది. ఈ చిత్రం సోమవారం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ లభించిన ఈ సినిమా 2 గంటల 49 నిమిషాల ప్రదర్శన సమయంతో రూపొందిదట! ఇక జనవరి 13న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానుంది. ఈ సినిమా కొన్ని రోజుల ముందే సెన్సార్ జరుపుకొని యు/ఏ సర్టిఫికెట్ సంపాదించింది. ఈ సినిమా ప్రదర్శన సమయం 2 గంటల 40 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తోంది. రెండు చిత్రాల్లోనూ ‘బ్రదర్ సెంటిమెంట్’ ఉందని సమాచారం. బాలకృష్ణ సినిమా ఆయనకు కంచుకోట లాంటి రాయలసీమ ప్రాంతంలో షూటింగ్ జరుపుకోగా, చిరంజీవికి ఎంతో ఇష్టమైన ‘వాల్తేరు’నే టైటిల్ లో నింపుకొని ఆయన సినిమా వస్తోంది.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఇద్దరు టాప్ స్టార్స్ నటించిన ఈ రెండు సినిమాల కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తమిళ చిత్రం ‘వారిసు’ డబ్బింగ్ వర్షన్ ‘వారసుడు’ను తెలుగునాట మూడు రోజులు వాయిదా వేసుకోవడమూ ప్రస్తుతం సినీజనాల్లో చర్చనీయాంశమయింది. తెలుగు సినిమా బాగుంటేనే తాము బాగుంటామని, అందువల్లే తెలుగు స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి చిత్రాలకు మొదటి రోజున థియేటర్లకు ఇబ్బంది కలుగ కూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని దిల్ రాజు చెప్పడాన్ని సినీపరిశ్రమలోని అధిక సంఖ్యాకులు అభినందిస్తున్నారు. ఇంతలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోన్న ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాయో మరి కొద్ది రోజుల్లోనే తేలనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!