Vyooham Teaser 2 : నిజం తన షూ లేస్ కట్టుకునే లోపే అబద్దం ప్రపంచమంతా ఒక రౌండ్ వేసి వస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ”వ్యూహం”. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ అమీర్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి మొదటి టీజర్ ను విడుదల చేయగా ఎంతో సంచలనం సృష్టించింది.. తాజాగా వ్యూహం సినిమా నుంచి రెండవ టీజర్ ను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సినిమాను వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న పరిణామాలను చూపిస్తూ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.రామ్ గోపాల్ వర్మ తాజాగా విడుదల చేసిన వ్యూహం టీజర్ 2 లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, చిరంజీవి,సోనియా గాంధీ వంటి పోలిన పాత్రలను చూపించడం జరిగింది.అలాగే జగన్ జైలు జీవితం, ఆంధ్రప్రదేశ్ విభజన వంటి విషయాలు కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్టుగా టీజర్ లో క్లియర్ కట్ గా చూపించారు రాంగోపాల్ వర్మ.
ఈ టీజర్ లో ”నిజం తన షూ లేస్ కట్టుకునేలోపే.. అబద్దం ప్రపంచం అంతా ఒక రౌండ్ వేసి వస్తుంది.”‘ అంటూ జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్ చెప్పిన డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది.. అలాగే చివరలో.. ఎప్పుడో ఒకసారి మీరు కల్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారు కదా అనే డైలాగ్ కూడా ఈ టీజర్ లో వినిపించింది. ఇందుకు చంద్రబాబు పోలిన పాత్రలోని వ్యక్తి..”వాడికి అంతా సీన్ లేదు.. తనను తానే పొడుచుకుంటాడు” అనే డైలాగ్ కూడా వినిపిస్తుంది.వ్యూహం సినిమాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందువిడుదల చేయాలని రామ్ గోపాల్ వర్మ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు విడుదల చేసిన వ్యూహం టీజర్ 2 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి అలజడి సృష్టిస్తుంది.ఇదిలా ఉంటే, ఆదివారం రామ్ గోపాల్ వర్మ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వ్యూహం సినిమాలో కేవలం తన అభిప్రాయం మాత్రమే ఉంటుందని అన్నారు.తాను నమ్మిన నిజాన్ని మాత్రమే చూపిస్తున్నానని ఈ సినిమాలో వివేకా హత్య గురించి కూడా ప్రస్తావిస్తానని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు.టీజర్ తో నే అలజడి సృష్టించిన రామ్ గోపాల్ వర్మ పూర్తి సినిమాతో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో చూడాలి.
Also Read
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!