Aishwarya Ragupathi: ధనుష్ ఈవెంట్ లో నటి ప్రైవేట్ పార్ట్ తాకిన పోకిరి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Ragupathi: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా సంక్రాంతికి బరిలో దిగుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని షురూ చేసిన మేకర్స్ కెప్టెన్ మిల్లర్ ఆడియో లాంచ్ ను ఘనంగా ఏర్పాటు చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ధనుష్ అభిమానుల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈవెంట్ లో నటికి చేదు అనుభవం ఎదురైంది. విజేగా కెరీర్ మొదలుపెట్టి.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఐశ్యర్య రఘపతి.. కెప్టెన్ మిల్లర్ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ఈవెంట్ కు ఆమె కూడా విచ్చేసింది.
ఈవెంట్ ను ముగిసాకా.. ఆమె జనాలతో పాటు బయటికి వెళ్ళడానికి ప్రయత్నించింది.
ఇక భారీ ఎత్తున ఉన్న అభిమానుల మధ్య ఒక పోకిరి.. నటి ప్రైవేట్ పార్ట్ ను తాకాడు. వెంటనే అది గమనించిన ఐశ్వర్య.. అతడిని పట్టుకొని తిడుతూ కొట్టడం మొదలుపెట్టింది. ఇక ఆ పోకిరి అక్కడనుంచి పారిపోవడానికి ప్రయత్నించగా.. చుట్టూ ఉన్నవారు కూడా ఆమెకు సపోర్ట్ గా నిలిచి పోకిరిని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ విషయాన్నీ ఐశ్వర్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది. ” ఆ జనం మధ్యలో ఒక పోకిరి నన్ను వేధించాడు. నేను అతని చూసాను.. వెంటనే పారిపోకుండా పట్టుకొని చితక్కొట్టాను. అతను పారిపోయాడు. కానీ, నేను ఛేజ్ చేశాను. అతను నా చేతిని విదిలించుకుని పారిపోయాడు. ఇంతమందిలో ఒక మహిళ ప్రైవేట్ పార్ట్ ను తాకే దైర్యం ఉందని నేను అనుకోలేదు. నేను అతనిపై అరుస్తూ దాడి చేసాను.నా చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు. ప్రపంచంలో చాలా మంది దయగల మరియు గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారని నాకు తెలుసు. కానీ ఈ కొద్ది శాతం రాక్షసుల చుట్టూ ఉండడానికి నేను చాలా భయపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
Also Read
- Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్‌పై వంగా కామెంట్ వైరల్!
- NTR Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్‌బ్యాక్‌లో ఊహించని ట్విస్ట్!
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
— Christopher Kanagaraj (@Chrissuccess) January 3, 2024
తాజావార్తలు
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్‌పై వంగా కామెంట్ వైరల్!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?