Viswambhara : సైలెంట్ బ్లాస్టింగ్.. మెగా ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ‘విశ్వంభర’ చుట్టూ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది, ప్రస్తుతానికి ఈ సినిమాపై అంచనాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం ఒక భారీ ‘సైలెంట్ ప్లాన్’తో సిద్ధమవుతోంది. ప్రచారానికి దూరంగా ఉన్న ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసేందుకు దర్శకుడు వశిష్ట అండ్ టీమ్ గట్టిగానే స్కెచ్ వేశారు. సినిమాపై ఇప్పటివరకు పెద్దగా హైప్ లేదన్నది వాస్తవం. అయితే, ఒక్క ట్రైలర్ విడుదలయ్యిందంటే సీన్ మొత్తం మారిపోతుందని చిత్రబృందం నమ్ముతోంది. అందుకే ట్రైలర్ కట్ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఒక్కొక్కటిగా నిర్మాతల చేతికి అందుతుండగా, అందులో కొన్ని సీక్వెన్స్ అంచనాలకు మించి అద్భుతంగా వచ్చినట్లు సమాచారం. ఆ ‘బెస్ట్ షాట్స్’ను ఏరి కోరి ట్రైలర్‌లో పొందుపరుస్తున్నారు.
Also Read:PM Modi: అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ
Also Read
సినిమా గురించి మాట్లాడటం లేదని నీరసపడిపోతున్న అభిమానులకు, రాబోయే ట్రైలర్ ఒక గట్టి షాక్ ఇవ్వబోతోందట. ఆ విజువల్స్ చూశాక సోషల్ మీడియాలో ‘విశ్వంభర’ మేనియా మొదలవ్వడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సినిమా రేంజ్ ఏంటో ఆ ట్రైలర్‌తోనే నిరూపించాలని మేకర్స్ పట్టుదలతో ఉన్నారు. నిజానికి శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుండి ఒక సాలిడ్ అప్‌డేట్ ఇవ్వాలని మేకర్స్ భావించారు. కానీ, అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ గ్లింప్స్ విడుదల కావడంతో, ఒకే ఇంట్లో రెండు అప్‌డేట్స్ ఎందుకులే అన్న ఉద్దేశంతో ‘విశ్వంభర’ టీమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సరైన సమయం చూసి ఒక్కసారిగా విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు వారు సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!