Vishwambhara Song Shoot to Commence from today: మెగాస్టార్ హీరోగా విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతోంది. గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార సినిమాని డైరెక్ట్ చేసిన మల్లిడి వశిష్ట ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ సబ్జెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జనవరి నెలలో మొదలైంది. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్గా బరిలోకి దిగిన ఈ సినిమాకు సంబంధించిన తాజా షూటింగ్ షెడ్యూల్ ఈరోజు నుంచి ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rana Daggubati: అది నను క్రూరంగా మార్చింది.. రానా కీలక వ్యాఖ్యలు
ఫిలింనగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈరోజు నుంచి నగర శివార్లలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఒక సాంగ్ షూటింగ్ జరగబోతోంది. షోబీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేయబోతున్న ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి ఇతర నటీనటులతో కలిసి చిందేయబోతున్నారు. సాధారణంగానే మెగాస్టార్ సినిమాలో పాటలు అంటే ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. దానికి తోడు చిరంజీవి డాన్స్ లో ఉండే గ్రేస్ అందరికీ ఈజీగా కనెక్ట్ అయి పోతుంది. ఇక ఈ సినిమాలో ఈ రోజు షూట్ చేయబోతున్న పాట చాలా కీలకంగా ఉండబోతుందని చెబుతున్నారు. అయితే నిజానికి ఈ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి సీక్వెల్ అని ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని తర్వాత క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాకి వశిష్ట కథ స్క్రీన్ ప్లే చూసుకుంటూ ఉండగా సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తున్నారు. ఇప్పటికే జనవరి 10 2025వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సినిమా యూనిట్ దానికి తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు.