Rana Daggubati says his illness made him mean: మూవీ మొఘల్ రామానాయుడు వారసుడిగా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరోగా కొనసాగుతున్న సమయంలో నిర్మాతగా మారారు ఆయన సోదరుడు సురేష్ బాబు. ఇక సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతున్న సమయంలో ఆయన పెద్ద కుమారుడు రానా లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆరడుగుల కటౌట్ మంచి ఆంగికం ఉండడంతో ఆయనకు త్వరగానే టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. అయితే అనారోగ్య కారణాలతో గత కొన్నాళ్ల నుంచి నటుడిగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు రానా. అయినా సరే ఒకపక్క నిర్మాణాలు చేస్తూ మరోపక్క విఎఫ్ఎక్స్ కంపెనీ నడుపుతూ సినీ రంగానికి చెందిన పనే చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన గురుగావ్ లో జరిగిన సినాప్స్ 20 24 అనే ఈవెంట్లో తన అనారోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకు చిన్నతనంలోనే కార్నియా మార్పిడి జరిగిందని, ఇక కొన్నాళ్ల క్రితం కిడ్నీ మార్పిడి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.
Mahesh Babu: 5 సెకన్లకి 5 కోట్లు ఛార్జ్ చేసిన మహేష్ బాబు?
ఇక అన్ని వైద్యాల కంటే ప్రకృతి వైద్యం మెరుగైనదని తనకు గతంలో తీవ్ర అనారోగ్యం ఎదురైనప్పుడు ప్రకృతి వైద్యమే తన కాపాడిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక బాహుబలి కంటే ముందు అనారోగ్యం కారణంగా తాను కొంత మౌనంగా- క్రూరంగా మారిన ఫీలింగ్ కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాను అలా మారడం చూసి కొంతమంది బాహుబలి సినిమాలో పాత్ర కోసం అలా మారానని అనుకున్నారు, మరికొందరు అనారోగ్యంతో ఉన్నానేమో అని అడిగేవారు. కానీ నేను వారికి అప్పుడు సమాధానం చెప్పలేదు అని రానా చెప్పుకొచ్చారు. ఇక ఎవరైనా తన అనారోగ్యం గురించి అడిగే ముందు కిడ్నీ లేదా కన్ను దానం చేస్తే తప్ప దాని గురించి అడగవద్దు అని చెప్పానని ఎందుకంటే ఆ సమయంలో తాను చేస్తున్నది తనకే నచ్చలేదని రానా చెప్పుకొచ్చారు. ఇక రానా ప్రస్తుతం తేజ కాంబినేషన్ లో రాక్షసరాజా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తుంది? అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు.