Laila: ‘లైలా’గా మారిన విశ్వక్ సేన్.. ఇదెక్కడి ట్విస్ట్ బాసూ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwaksen Shine Screens #VS12 Titled Fascinatingly Laila: గామి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ క దాస్ విశ్వక్ సేన్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లకు సైన్ చేశారు. ముఖ్యంగా విశ్వక్ సేన్ తన12వ సినిమా కోసం బట్టలరామ స్వామి బయోపిక్కు దర్శకుడు రామ్ నారాయణ్‌తో చేతులు కలిపారు. #VS12 చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిండచే ఈ చిత్రంలో రామ్ నారాయణ్, విశ్వక్ సేన్‌ను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని ప్రకటించారు. విశ్వక్ సేన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘లైలా’ అనే టైటిల్ పెట్టగా టైటిల్ పోస్టర్ కంప్లీట్ కలర్ ఫుల్ గా ఉంది. పోస్టర్ ప్లజెంట్, వైలెంట్ వస్తువులతో బ్యాలెన్స్ చేయడం చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ పాత్రలో నటించబోతున్నారని ప్రచారం జరిగింది. అందుకు ఊతం ఇస్తూనే ఈ సినిమాకి లైలా అనే పేరు పెట్టడం చర్చనీయాంశం అయింది.
Navdeep: ఎమ్మెల్యేగా పోటీ.. పెళ్లిపై నవదీప్ ప్రకటన?
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ఇందులో పూలు, సీతాకోక చిలుకలు, అద్దం, కొవ్వొత్తి, మేకప్ కిట్, రేడియో, చార్మినార్, తుపాకీ, నెత్తురోడుతున్న కత్తి, మేక తల మొదలైనవి ఉండగా టైటిల్ పోస్టర్ సినిమా గురించి మరింత తెలుసుకోవాలనే క్యురియాసిటీ కలిగిస్తుంది. మోషన్ పోస్టర్లో పోస్టర్లో చూపిన అన్ని ఎలిమెంట్స్‌ను విడివిడిగా చూపించగా అందులో యానిమేషన్ పార్ట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. టైటిల్, మోషన్ పోస్టర్ చూస్తే సినిమాలో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని సూచిస్తున్నాయి. ఇక ఆమె పేరు తర్వాత తెలియజేయనున్నారు. అద్భుతమైన టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారని తెలుస్తోంది. రిచర్డ్ ప్రసాద్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ మూర్తి రచయిత. తనిష్క్ బాగ్చి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నటీనటులకు సంబంధించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!