యంగ్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలు ప్రకటిస్తూ వెళుతున్నారు. అందులో భాగంగానే ఆయన హీరోగా ధమ్కీ అనే సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం నాడు రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ల మీద సంయుక్తంగా విశ్వక్సేన్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. ‘పాగల్’ సినిమాకు దర్శకత్వం వహించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, అదే సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేద పెతురాజ్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.
Read Also : AP Govt new G.O : కొత్త జీవోపై మహేష్ బాబు రియాక్షన్