Vishwak Sen shared difficult situations While Shooting for Gaami: విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గామి, సుమారు ఐదేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ శివరాత్రి సందర్భంగా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు విశ్వక్సేన్. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏదైనా ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యాయా అని అడిగితే తనకు చాలావరకు గుర్తులేదు కానీ రెండు సందర్భాలు మాత్రం బాగా గుర్తుండిపోయాయని అన్నారు. హైదరాబాద్ కొంపల్లి దగ్గరలో గ్రీన్ మ్యాట్ షూట్ చేస్తున్న సమయంలో 5000 కేజీల ఉప్పు గుట్టలుగా పోసి పనిచేయాల్సి వచ్చిందని అన్నారు.
Samantha: చైతూ కంటే ముందు అతని లవ్ లోనే ఉన్నా.. అసలు సంగతి బయట పెట్టేసిన సమంత
తాను మేకప్ వేసుకున్న తర్వాత ఆ ఉప్పుగుట్టలు ఎక్కుతుంటే ఉప్పు నెమ్మదిగా దుస్తుల లోపలికి వెళ్లిపోయేదని ఆ మేకప్ వేయడానికి సమయం పడుతుంది కాబట్టి వాటిని దులుపుకోలేక షూటింగ్ జరుగుతున్నంత సేపు ఆ ఉప్పు దుస్తుల లోపల ఇబ్బంది పెడుతున్నా సరే నటించానని చెప్పుకొచ్చారు. అంతేకాక హిమాలయాల దగ్గర షూటింగ్ చేస్తున్న సమయంలో గడ్డ కట్టిన నది మీద షూట్ చేయాల్సి వచ్చిందని ఆ సమయంలో కూడా కాస్త భయం వేసిందని అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే నది మీద గడ్డకట్టుకుని ఉంటుంది, కింద నీరు పారుతూ ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఐస్ కరిగి లోపల పడితే సుమారు 35 -40 కిలోమీటర్ల వరకు అందులో పడి కొట్టుకు పోతామని అలాంటి సమయంలో కూడా టీం స్పిరిట్ దెబ్బ తీయకూడదు అనే ఉద్దేశంతో తాను షూట్లో పాల్గొన్నాను అని చెప్పుకొచ్చాడు. నిజానికి ఆ సమయంలో తనకు భయం వేసినప్పుడు డైరెక్టర్ తాను గెంతి చూపించేవాడు కానీ షూట్ చేస్తున్న సమయంలో కాస్త భయం వేసేదని అన్నారు. చాందిని చౌదరి అయితే లోపల పడిపోతుందని అనుకున్నామని అయితే ఆమె చాకచక్యంగా బయటకు వచ్చిందని చెప్పుకొచ్చారు.