Cult Trailer: ఈ రక్తపాతానికి అడ్డు అదుపు లేదా ‘విశ్వక్’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cult Trailer: సినిమా అంటే వినోదం.. థ్రిల్ ఉండాలి, అవసరమైన చోట యాక్షన్ కూడా ఉండాల్సిందే. కానీ ఇటీవల టాలీవుడ్లో యాక్షన్ పేరుతో హద్దులు దాటిపోతున్న రక్తపాతం చూస్తుంటే వెండితెరపై ఏం చూపిస్తున్నారనే ఆందోళన కలగక మానదు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘కల్ట్’ ట్రైలర్ విడుదలయ్యాక ఇప్పుడు సరిగ్గా ఇదే చర్చ మొదలైంది. భారతదేశంలోనే తొలి ‘R’ రేటెడ్ సినిమా అంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ నిండా కనిపిస్తున్న నరుకుడు, ఒళ్లు గగుర్పొడిచే వయోలెన్స్ చూసి సాధారణ ప్రేక్షకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
విశ్వక్ సేన్ మార్కెట్‌ను పెంచడం కోసం, లేదా డిఫరెంట్ జానర్ పేరుతో ఇలాంటి మితిమీరిన రక్తపాతాన్ని చూపించాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ట్రైలర్ మొత్తం డ్రగ్స్ మాఫియా, 300 మందిని బంధించి ఆడించే డెడ్లీ సర్వైవల్ గేమ్ చుట్టూ తిరుగుతోంది. అందులో రూల్స్ బ్రేక్ చేసిన వారికి ఇచ్చే శిక్షలు, మనుషులను వేటాడి చంపే స్లాషర్ సీన్లు చూస్తుంటే.. ఇది సినిమానా లేక హింసను వైభవీకరించే ప్రయోగమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోలీస్ పాత్రలో విశ్వక్ లుక్ బాగున్నా, సీన్లలో కనిపిస్తున్న విపరీతమైన క్రూరత్వం మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు దూరం చేసేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.
Also Read
వెస్ట్రన్ కంట్రీస్‌లో స్లాషర్ జానర్ ఉన్నప్పటికీ, మన నేటివిటీకి, మన ప్రేక్షకులకు ఇంతటి రక్తపాతం నిజంగా రుచిస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయం. ‘R’ రేటెడ్ అన్న ట్యాగ్‌ను అడ్డుపెట్టుకుని సెన్సార్ హద్దులను దాటేస్తూ చూపించే ఇలాంటి కంటెంట్‌ను అందరూ స్వీకరించలేరు. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ వయోలెన్స్‌ను మరింత పెంచి చూపించింది. అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా వెండితెరపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో కానీ.. ట్రైలర్లో కనిపించిన రక్తపాతానికి మాత్రం కొంచెం అడ్డు అదుపు ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!